మొత్తానికి జక్కన్న హిట్‌ అంటారు..!

మొత్తానికి జక్కన్న హిట్‌ అంటారు..!

ఓ సినిమా హిట్టవ్వాలంటే కావాల్సింది టాక్‌.. ప్రశంసలు కాదు.. పైసల్‌ అంటున్నాడు సునీల్‌. డబ్బొస్తే అది చెత్త సినిమా కాదని తేల్చి చెప్పేసాడు ఈ భీమవరం బుల్లోడు. ఈ డబ్బులు తీసుకురాలేని సినిమాలు సునీల్‌ కెరీర్‌ లో ఈ మధ్య చాలా వచ్చాయి. ఈయనకు హిట్‌ లేక చాలా కాలమైంది. ఇంకా మాట్లాడితే మర్యాదరామన్న, పూలరంగడు తర్వాత సునీల్‌ కెరీర్‌ లో ఇప్పటి వరకు మరో హిట్‌ రాలేదు. తడాఖా హిట్టైనా.. అందులో నాగచైతన్య కూడా ఓ హీరోగా నటించాడు. దాంతో ఇప్పుడు సునీల్‌ కెరీర్‌ గాడిన పడాలంటే కచ్చితంగా ఆయన హిట్‌ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. ఇలాంటి టైమ్‌ లో వచ్చింది జక్కన్న. వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేమకథాచిత్రం ఫేమ్‌ సుదర్శన్‌ రెడ్డి నిర్మించాడు. తొలిరోజు ఈ సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది.

ఈ సినిమా టాక్‌ చూసి సునీల్‌ కోరుకున్న విజయాన్నైతే ఈ సినిమా తీసుకొస్తుందని ఎవ్వరూ నమ్మలేదు. మరోవైపు ప్రేక్షకులు కూడా జక్కన్న సగం తృప్తినే మిగిల్చాడని నిరాశలో ఉన్నారు. అయితే ఎక్కడో సునీల్‌ ను దేవుడు కరుణించాడు. ఈయనకు మాస్‌ లో ఉన్న ఫాలోయింగ్‌ బాగా కలిసొచ్చింది. ఈ సినిమా బిజినెస్‌ 14 కోట్ల వరకు జరిగింది. ఇప్పుడు వసూళ్లు చూస్తుంటే 15 కోట్లు దాటిపోయాయి. ఈ లెక్కన జక్కన్న హిట్టే. ఒప్పుకోడానికి కాస్త కష్టంగా ఉన్నా.. సునీల్‌ కు బి, సి సెంటర్లలో ఉన్న ఫాలోయింగ్‌ తో జక్కన్న బయట పడిపోయాడు. అయితే సునీల్‌ కోరుకున్న బ్లాక్‌ బస్టర్‌ కోరిక మాత్రం తీరట్లేదు. మొత్తానికి ఫ్లాప్‌ అనుకున్న జక్కన్నను అలా హిట్‌ చేసారన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు