బాబు బంగారం బతికిస్తాడా?

బాబు బంగారం బతికిస్తాడా?

భారీ అంచనాల మధ్య విడుదలైంది 'బాబు బంగారం'. కాంబినేషన్‌ క్రేజ్‌కు తోడు.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషం చాలా పాజిటివ్‌గా కనిపించింది. తొలిసారి స్టార్‌ హీరోతో సినిమా చేస్తున్న మారుతి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కనిపించాడు. అలాగే విక్టరీ వెంకటేష్‌ కూడా సోలో హీరోగా చాన్నాళ్ల తర్వాత ఓ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంటాడేమో అనుకున్నారంతా. కానీ సినిమా చూశాక జనాలు పూర్తిగా డిజప్పాయింట్‌ అయ్యారు. అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా. వెంకీ లాంటి ఎంటర్టైనింగ్‌ హీరోను పెట్టుకుని మారుతి ఇలా ఓ బోరింగ్‌ సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సినిమాకు బ్యాడ్‌ టాక్‌ వచ్చింది.

ఐతే టాక్‌ ఎలా ఉన్నా సరే.. 'బాబు బంగారం'కు కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. ఈ వారం విడుదలైన మరో తెలుగు సినిమా 'తిక్క'కు ముందు నుంచి హైప్‌ లేదు. అందరి దృష్టి 'బాబు బంగారం' మీదే నిలిచింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగా జరిగాయి. రిలీజ్‌ కూడా భారీగా చేయడంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలి రోజు తర్వాత కూడా కలెక్షన్లేమీ పడిపోలేదు. రెండు, మూడు రోజుల్లో కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. తొలి రోజు దాదాపు రూ.6 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసిన 'బాబు బంగారం' ఫస్ట్‌ వీకెండ్లో రూ.12-13 కోట్ల దాకా రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో కూడా వసూళ్లు బాగున్నాయి. తర్వాతి వారం వస్తున్న రెండూ చిన్న సినిమాలే కావడం 'బాబు బంగారం'కు కలిసొచ్చే విషయమే. రెండో వీకెండ్‌ అయ్యేసరికి రూ.20 కోట్ల మార్కును దాటేస్తే బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశముంది. ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.27 కోట్లకు అమ్మారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English