విక్రమ్‌ కుటుంబంలో సంతోషం

విక్రమ్‌ కుటుంబంలో సంతోషం

అవును.. హీరో విక్రమ్‌ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఆ కుటుంబం ఎంతో సెంటిమెంటుగా భావించిన ఉంగరం దొరికేసింది. ఈ మధ్యే విక్రమ్‌ కూతురు అక్షితకు..  మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబానికి చెందిన మను రంజిత్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే నాలుగు రోజుల కిందట ఓ ఐస్‌ క్రీమ్‌ పార్లర్లో అక్షిత తన ఎంగేజ్మెంట్‌ రింగ్‌ పోగొట్టుకుంది. ఆ రింగ్‌ ఖరీదు రూ.12 లక్షలకు పైనే. ఐతే డబ్బు కంటే కూడా నిశ్చితార్థం ఉంగరం పోయిందని విక్రమ్‌ కుటుంబం చాలా బాధపడింది. పార్లర్‌ అంతటా వెదికించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు విక్రమ్‌.

పోలీసులు పార్లర్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు చాలామంది వ్యక్తుల్ని విచారించారు. ఇంతలో లక్ష్మణన్‌ అనే ఓ క్యాబ్‌ డ్రైవర్‌ స్వయంగా ఈ రింగ్‌ తీసుకొచ్చి విక్రమ్‌ కుటుంబానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అతడికి ఆ రింగ్‌ ఎలా దొరికిందన్న వివరాలు తెలియలేదు. లక్ష్మణన్‌ గాంధీ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. ఏదేమైనా ఈ రింగ్‌ దొరకడంతో విక్రమ్‌ కుటుంబంతో పాటు వరుడి ఫ్యామిలీ కూడా హమ్మయ్య అనుకుంది. శుభకార్యాలు జరిగే ముందు ఇలాంటి వ్యవహారాల్ని సెంటిమెంటుగా ఫీలవుతారు జనాలు. ఇక విక్రమ్‌ అల్లుడి సంగతి చూస్తే.. చెన్నైలోని ప్రముఖ సీకే బేకరీ యజమాని కొడుకే మను రంజిత్‌. అతను కరుణానిధికి ముని మనవడు అవుతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English