ప్రకంపనలు రేపుతున్న ధోని ట్రైలర్‌

ప్రకంపనలు రేపుతున్న ధోని ట్రైలర్‌

మహేంద్రసింగ్‌ ధోని మీద దేశంలో ఎంత అభిమానం ఉందో మరోసారి రుజువైంది. అతడి జీవిత కథతో తెరకెక్కిన 'ఎం.ఎస్‌.ధోని' ట్రైలర్‌ కు మామూలు రెప్పాన్స్‌ రావట్లేదు. ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌ రికార్డుల దుమ్ముదులిపింది. కేవలం 24 గంటల్లోనే 52 లక్షల మందికి పైగా ధోని ట్రైలర్‌ చూశారు. ఇండియాలో ఒక్క రోజులో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న ట్రైలర్‌ ఇదే. సల్మాన్‌.. అమీర్‌.. షారుఖ్‌ ఖాన్‌ లాంటి మెగా స్టార్ల సినిమాల రికార్డుల్ని కూడా ధోని ట్రైలర్‌ దాటేసింది. ఇప్పటిదాకా సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' ట్రైలర్‌ 33 లక్షల వ్యూస్‌ తో అగ్ర స్థానంలో ఉంది. దాన్ని భారీ తేడాతో దాటేసింది ధోని ట్రైలర్‌.

రెండు రోజులు కలిపి 93 లక్షల మంది దాకా ధోని ట్రైలర్‌ చూశారు. లైక్స్‌ కూడా అనూహ్యంగా వచ్చాయి. ఇప్పటిదాకా రెండున్నర లక్షల లైక్స్‌ వచ్చాయి. దీనికి డిజ్‌ లైక్స్‌ 4 వేలు మాత్రమే వచ్చాయి. లైక్స్‌.. డిజ్‌ లైక్స్‌.. రేషియో ప్రకారం చూస్తే ధోని మీద.. ఈ సినిమా మీద అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. బాలి పేరిట ఉన్న అత్యధిక వ్యూస్‌ రికార్డును కూడా ధోని ట్రైలర్‌ బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ నటిస్తున్నాడు. వెడ్నస్‌ డే.. బేబీ.. స్పెషల్‌ చబ్బీస్‌ సినిమాల దర్శకుడు నీరజ్‌ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా అనుమతి కోసం ధోనికి రైట్స్‌ రూపంలోనే 30 కోట్లకు పైగా చెల్లించడం విశేషం. సెప్టెంబరు 30న 'ఎం.ఎస్‌.ధోని' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు