త్రివిక్ర‌మ్ స‌క్సెస్.. మారుతి ఫెయిల్‌

త్రివిక్ర‌మ్ స‌క్సెస్.. మారుతి ఫెయిల్‌

హీరోయిన్ తండ్రి ఓ హంత‌కుడు. పోలీసుల‌కు.. రౌడీల‌కు దొర‌క్కుండా తిరుగుతుంటాడు. హీరోయిన్ తండ్రి కోసం త‌పిస్తూ ఉంటుంది. హీరో ఆమెను చూసి అనుకోకుండా ప్రేమిస్తాడు. త‌న ఐడెంటిటీ మార్చుకుని ఆమెకు ద‌గ్గ‌ర‌వుతాడు. ఐతే హీరో పోలీస్ అని.. త‌న తండ్రి కోస‌మే త‌న వెంట‌ప‌డ్డాడ‌ని... ఇదంతా ఓ స్కెచ్ అని త‌ర్వాత హీరోయిన్ కు తెలుస్తుంది. హీరోను అస‌హ్యించుకుంటుంది. ఐతే హీరోయిన్ లోని అపార్థాన్ని తొల‌గించి హీరో ఆమె మ‌న‌సు గెలుస్తాడు. ఈ క‌థంతా వింటుంటే ఎవ‌రికైనా 90ల్లో వ‌చ్చిన నాగార్జున సినిమా ‘నిర్ణ‌యం’ గుర్తుకు రాక‌మాన‌దు. అప్ప‌ట్లో ఆ సినిమా చూసిన వాళ్లంద‌రికీ ఇప్పుడు ‘బాబు బంగారం’ చూస్తుంటే ప‌దే ప‌దే ఆ ఛాయ‌లు గుర్తుకు రాకా మాన‌వు.

మొన్న త్రివిక్ర‌మ్ ఒక‌ప్ప‌టి ‘మీనా’ సినిమాను అటు ఇటు మార్చి ‘అఆ’గా తీశాడు. మాంచి విజ‌యాన్నందుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో మారుతి కూడా పయనించాడు. ‘నిర్ణ‌యం’ క‌థ‌నే రీసైకిల్ చేసి ‘బాబు బంగారం’ తీశాడు. కానీ ఇక్కడ ఫలితం తేడా కొట్టేసింది. ‘అఆ లాగా ‘బాబు బంగారం ఆడే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ‘మీనా’ ప్లాట్ తీసుకుని త్రివిక్ర‌మ్ త‌న‌దైన ట‌చ్ ఇచ్చి బాగానే తీర్చిదిద్దాడు కానీ.. మారుతి మాత్రం ‘నిర్ణ‌యం’ లైన్‌ను చెడ‌గొట్టాడు. ‘నిర్ణయం’ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో ‘బాబు బంగారం’ అంత బోరింగ్‌గా సాగుతుంది. నిర్ణ‌యంలో లాగా.. ఇందులో తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ స్టోరీకి కానీ.. హీరో హీరోయిన్ ప్రేమకథకు కానీ.. ప్రేక్షకులు కనెక్టవ్వ‌లేదు. ‘అఆ’ హిట్ట‌యింది కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ కాపీ వివాదంలో చిక్కుకున్నాడు కానీ.. ‘బాబు బంగారం’ విష‌యంలో మారుతికి వ‌చ్చిన ఇబ్బందేమీ లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English