సుకుమార్‌ కు మారుతి సెటైర్‌

సుకుమార్‌ కు మారుతి సెటైర్‌

సుకుమార్‌ తీసే సినిమాల విషయంలో ఓ కంప్లైంట్‌ ఉంటుంది. అతడి కథాకథనాలు కాంప్లికేటెడ్‌ గా ఉంటాయని.. సామాన్యులకు అంత సులువుగా అర్థం కావని అంటారు. '1 నేనొక్కడినే' సినిమా ఫ్లాప్‌ కావడానికి అదే కారణం అన్న అభిప్రాయాలున్నాయి. 'నాన్నకు ప్రేమతో' కూడా సగటు ప్రేక్షకుడి బుర్రకు పరీక్ష పెట్టేదే. దీనిపై కొందరు పాజటివ్‌ గా స్పందిస్తారు. ఇంకొందరు నెగెటివ్‌ గా మాట్లాడతారు. ఐతే ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో డైరెక్టర్‌ మారుతి తన కొత్త సినిమా 'బాబు బంగారం'లో వేసిన సెటైర్‌ చర్చనీయాంశమవుతోంది.

'బాబు బంగారం'లో 'నాన్నకు ప్రేమతో' మీద ఓ స్పూఫ్‌ చేశాడు మారుతి. కమెడియన్‌ పృధ్వీ 'నాన్నకు ప్రేమతో క్లైమాక్సులో ఎన్టీఆర్‌ తరహాలో డ్రెస్‌ వేసుకుని ఇంకో ఇద్దరితో కలిసి హీరోయిన్‌ ఇంటికి అర్ధరాత్రి వస్తాడు. అప్పుడు 'నాన్నకు ప్రేమతో' థీమ్‌ మ్యూజిక్‌ (డోంట్‌ స్టాప్‌ టిల్‌ యు..) వస్తుంది. ఆ సందర్భంగా హీరోయిన్‌ తో మాట్లాడుతూ.. నీకీ 'నాన్నకు ప్రేమతో' కాన్సెప్ట్‌ అర్థం కాలేదా అంటాడు. ఊహూ అనగానే... ''అర్థం కాలేదా అయితే సూపర్‌ హిట్టే'' అని కామెంట్‌ చేస్తాడు పృధ్వీ. అలాగే నువ్వు ఎన్నారై అయితే ఇంకా బాగుండేది అనే ఇంకో కామెంట్‌ కూడా విసురుతాడు.

అంటే 'నాన్నకు ప్రేమతో' సినిమా జనాలకు అర్థం కాలేదు కాబట్టే హిట్టయిపోయిందన్న అర్థం వస్తుంది ఈ సన్నివేశం చూస్తే. ఈ చిత్రానికి యుఎస్‌ లో మంచి వసూళ్లు రావడం తెలిసిందే. అంటే ఎన్నారైలు 'నాన్నకు ప్రేమతో'ను బాగా ఆదరించారన్న విషయాన్ని కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి సుకుమార్‌ కు మారుతి కాంప్లిమెంట్‌ ఇచ్చినట్లే ఇచ్చి సెటైర్‌ కూడా వేశాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English