పెళ్లిచూపులు.. ఆ మిరాకిల్ చేస్తుందా?

పెళ్లిచూపులు.. ఆ మిరాకిల్ చేస్తుందా?

బాగున్న సినిమాల‌న్నీ ఆడేయాల‌నేం లేదు. గ‌త శుక్ర‌వారం చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమా ‘మ‌న‌మంతా’కు చాలా మంచి టాక్ వ‌చ్చింది. కానీ ఆ సినిమా స‌రిగా ఆడ‌ట్లేదు. కానీ అంత‌కుముందు వారం వ‌చ్చిన ‘పెళ్లిచూపులు’ మాత్రం ఇర‌గాడేస్తోంది. కేవ‌లం కోటిన్న‌ర బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్ప‌టికే రూ.10 కోట్ల‌కు పైనే వ‌సూలు చేసిన‌ట్లు అంచ‌నా. ఫుల్ ర‌న్లో రూ.20 కోట్ల మార్కును దాటినా ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.

ముఖ్యంగా అమెరికాలో ‘పెళ్లిచూపులు’ డ్రీమ్ ర‌న్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా స్థాయికి.. దాని మీద ఉన్న అంచ‌నాల ప్ర‌కారం అక్క‌డ ల‌క్ష డాల‌ర్లు వ‌సూలు చేసినా గొప్పే అనుకున్నారు. కానీ అక్క‌డ ఏకంగా 8 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్కును దాటేసింది. హాఫ్ మిలియ‌న్ మార్కుకే ఔరా అనుకుంటే ఇప్పుడు ఏకంగా మిలియ‌న్ క్ల‌బ్ మీద క‌న్నేసింది. ఈ వీకెండ్లో ఆ మార్కుకు చేరువ‌గా వచ్చేలా క‌నిపిస్తోంది.

గ‌త వారం విడుద‌లైన రెండు కొత్త సినిమాలు ‘పెళ్లిచూపులు’ క‌లెక్ష‌న్ల‌పై ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. అవి రెండు క‌లిపి సాధించిన వ‌సూళ్ల కంటే పెళ్లిచూపులు సినిమానే ఎక్కువ క‌లెక్ట్ చేసింది. విశేషం ఏంటంటే.. ఈ వారం బాబు బంగారం, తిక్క లాంటి పెద్ద సినిమాలు వ‌స్తున్నా పెళ్లిచూపులు చిత్రాన్ని కొత్త‌గా ప‌ది లొకేష‌న్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్లు కూడా 10 డాల‌ర్ల‌కు త‌గ్గించ‌డం బాగా క‌లిసి రావ‌చ్చు. కాబ‌ట్టి ‘పెళ్లిచూపులు’ మిలియ‌న్ క్ల‌బ్బును అందుకుని మిరాకిల్ చేసినా చేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు