నయనతారని బ్యాడ్‌ చేయవద్దు - వెంకీ వార్నింగ్‌

నయనతారని బ్యాడ్‌ చేయవద్దు - వెంకీ వార్నింగ్‌

'బాబు బంగారం' చిత్రానికి నయనతార కోపరేట్‌ చేయలేదని, ఆమె కారణంగా షూటింగ్‌ డిలే కావడమే కాకుండా విడుదల కూడా చాలాసార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆ యూనిట్‌ చాలా కోపంగా వుంది. అయితే ఈ చిత్రంలో నయనతారని ఏరి కోరి హీరోయిన్‌గా పెట్టుకున్న వెంకటేష్‌ తన యూనిట్‌కి స్పష్టమైన వార్నింగ్‌ ఇచ్చాడట. నయనతారని బ్యాడ్‌ చేయవద్దని, మీడియా ఆమె గురించి ఏమి అడిగినా కానీ పాజిటివ్‌గానే చెప్పండని, అంతే తప్ప నెగెటివ్‌గా మాట్లాడవద్దని డైరెక్టర్‌కి, నిర్మాతకి, ఇతర నటీనటులకి కూడా వెంకీ గట్టిగా చెప్పాడట. వెంకీని హర్ట్‌ చేయడం ఇష్టం లేక నయనతార గురించి వినిపిస్తోన్న రూమర్ల గురించి స్పందించడానికి బాబు బంగారం బృందం తటపటాయిస్తోంది.

తన గురించి వరుసపెట్టి రూమర్లు వచ్చే సరికి వెంకటేష్‌కి కాల్‌ చేసి నయనతార బాధ పడిందని, ఆమెతో ఇంతకుముందే రెండు సినిమాలు చేసిన స్నేహం ఉండడంతో నయనతారని బాధ పెట్టడం ఇష్టం లేక తనకి ఇక ఎలాంటి మాట రాదని వెంకీ నయనతారకి మాట ఇచ్చాడట. హీరోనే వార్నింగ్‌ ఇవ్వడంతో పబ్లిగ్గా నయనతారని ఏమీ అనలేక మీడియా వర్గాల వారికి వెనక నుంచి ఆమెపై రూమర్లని ఈ చిత్ర బృందమే అందిస్తోందని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English