నందమూరి, మెగా హీరోలు ఫ్రెండ్సే... కానీ

నందమూరి, మెగా హీరోలు ఫ్రెండ్సే... కానీ

చిరంజీవి, బాలకృష్ణ మధ్య ప్రొఫెషనల్‌ రైవల్రీ ఎంత ఉన్నా కానీ, వ్యక్తిగతంగా ఇద్దరూ చాలా సఖ్యంగా వుంటారు. చిరంజీవి ఇంట్లో వేడుకలకి బాలయ్య చేసే సందడి, అలాగే బాలయ్యని పబ్లిక్‌లో కలిసినప్పుడు చిరంజీవి చూపించే అభిమానం ఎన్నిసార్లు చూడలేదు. అలాగే ఈ కుటుంబాలకి చెందిన యువ హీరోల మధ్య కూడా సఖ్యత వుంది. ఎన్టీఆర్‌కి చరణ్‌, అల్లు అర్జున్‌ ఇద్దరూ మంచి స్నేహితులే. అయితే ఈ స్నేహం కేవలం తెర వెనుకే తప్ప... సినిమా ఇండస్ట్రీలో మాత్రం వీళ్లంతా పోటీదారులే. అందుకేనేమో వీళ్లతో కలిసి సినిమా చేద్దామని ఎవరు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది వర్కవుట్‌ అవలేదు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ అది నిజం కాలేదు.

అలాగే ఇప్పుడు యువ హీరోలు కూడా కలిసి తెర మీద కనిపించడానికి అభిమానుల మనోభావాల గురించి ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా చేద్దామని నిర్మాత కె.ఎస్‌. రామారావు ప్రయత్నించారట. తన దగ్గరో కథ వుందని, ఒకసారి వినమని అడిగారట. అసలు కథే వినకుండా ఇద్దరు హీరోలు తిరస్కరించారట. దీనిని బట్టి మల్టీస్టారర్లు చేయడానికి, అందునా మెగా-నందమూరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ చేయడానికి ఇరు వర్గాల నుంచి ఆసక్తి లేదని తేలిపోయింది. స్టార్లు చేయకపోతే... ఇక ఈ కుటుంబాలకి చెందిన యువ హీరోలని అయినా కలిపే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు