భారీ బిజినెస్.. భారీ రిలీజ్.. భారీ వసూళ్లు..?

భారీ బిజినెస్.. భారీ రిలీజ్.. భారీ వసూళ్లు..?

చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ వేడెక్కుతోంది. ‘అఆ’ తర్వాత క్రౌడ్ పుల్లింగ్ సినిమా ఏదీ రాలేదు తెలుగులో. ఇప్పుడు ‘బాబు బంగారం’తో మళ్లీ థియేటర్ల దగ్గర సందడి కనిపించబోతోంది. గత కొన్నేళ్లలో వెంకటేష్ కొన్ని విజయాలైతే అందుకున్నాడు కానీ.. క్రమక్రమంగా క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ తగ్గిపోయింది.

ఒకప్పట్లా మాస్ ప్రేక్షకుల్ని, తన అభిమానుల్ని ఆకర్షించే.. వారిలో ఉత్సాహం తెచ్చే సినిమా చేయలేదు. దీంతో ఆయన మార్కెట్ కూడా దెబ్బతింది. ఐతే మారుతి మాత్రం వెంకీని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూశాక వెంకీ ఫ్యాన్స్‌లో ఒకప్పటి ఉత్సాహం వచ్చింది. సినిమా మీద సామాన్య జనాల్లోనూ ఆసక్తి పెరిగింది. టైటిల్ దగ్గర్నుంచి ఈ సినిమా విషయంలో అన్నీ పాజిటివ్‌గా కనిపించాయి. దీంతో సినిమా భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో విడుదలవుతోంది.

‘బాబు బంగారం’ సినిమాకు వెంకీ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ.27 కోట్లకు అమ్మారు. శాటిలైట్, ఇతర హక్కులు కూడా కలిపితే లెక్క రూ.35 కోట్లను దాటుతుంది. వెంకీ సోలో హీరోగా నటించిన సినిమాల్లో దేనికీ లేని విధంగా ఈ చిత్రాన్ని వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్నాయి. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే రావచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. వెంకీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ‘బాబు బంగారం’ ఘనత సాధించవచ్చు. ఆ టాక్ ఏంటన్నది రేపు తేలిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English