యేలేటిని క్షమించేశానన్న రాజమౌళి

యేలేటిని క్షమించేశానన్న రాజమౌళి

తెలుగులో మరే దర్శకుడూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు రాజమౌళి. ఐతే ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉంటాడు. ఏదైనా మంచి సినిమా వస్తే దాని గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాడు. తనవంతుగా ఆ సినిమాలకు తోడ్పాటు అందించడానికి ముందుకొస్తాడు. లేటెస్టుగా 'పెళ్లిచూపులు' సినిమా గురించి పాజిటివ్‌ ట్వీట్లు చేయడంతో పాటు ఆ చిత్ర బ ందాన్ని కలిసి అభినందనలు కూడా తెలిపాడు రాజమౌళి.

దాని తర్వాత తన బంధువు, మిత్రుడు అయిన చంద్రశేఖర్‌ యేలేటి తీసిన 'మనమంతా'కు కూడా ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నాడు జక్కన్న. 'బాహుబలి: ది కంక్లూజన్‌' షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ 'మనమంతా'ను ప్రమోట్‌ చేయడానికి రాజమౌళి ముందుకు రావడం.. తనే స్వయంగా యేలేటిని ఇంటర్వ్యూ కూడా చేయడం విశేషం. ఈ సందఠంగా రాజమౌళి యేలేటికి మూడు మాటలు చెప్పాడు. యేలేటిని 'ఏరా' అంటూ సంబోధిస్తూ జక్కన్న చెప్పిన ఆ మూడు మాటలేంటో ఆయన మాటల్లోనే వినండి.

''ముందుగా నీకు కంగ్రాట్స్‌ రా. ఎందుకంటే ఇది మా సినిమా.. తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే ఓ చిత్రాన్ని తీసినందుకు. రెండో మాట.. థ్యాంక్స్‌. తెలుగులో మంచి సినిమాలు గొప్ప సినిమాలు రావేంటని అందరూ అడుగుతుంటారు. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడానికి ఓ సినిమాను అందించినందుకే ఈ థ్యాంక్స్‌. ఇక మూడో మాట.. నిన్ను క్షమించేస్తున్నా. ఎందుకంటే గొప్ప లైన్లు రాస్తుంటావు కానీ.. ఆ లైన్‌ డెవలప్‌ చేయడానికి సినిమా తీయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటూ ఉంటావని నీ మీద నాకు చాలా కోపం. ఐతే మనమంతా సినిమా చూశాక మాత్రం ఇలాంటి గొప్ప స్క్రీన్‌ ప్లే రాయడం మామూలు విషయం కాదని అర్థమైంది. కాబట్టి ఈ సినిమాకు అంత సమయం తీసుకోవడం కరెక్టే. కాబట్టే క్షమించేస్తున్నా'' అని రాజమౌళి యేలేటిని ఉద్దేశించి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English