సేనాపతి పవన్‌ కాదు.. మంచు విషు?

సేనాపతి పవన్‌ కాదు.. మంచు విషు?

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టాక ఆయన్ని జన సేనాని అని.. సేనాపతి అని పిలుచుకుంటున్నారు అభిమానులు. కొందరేమో పవన్‌ 'సేనాపతి' పేరుతో ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు ప్రచారం చేశారు. తమ క్రియేటివిటీని జోడించి ఈ టైటిల్‌తో పవన్‌ పోస్టర్లు కూడా కొన్ని వదిలారు. ఐతే వెండితెర 'సేనాపతి' పవన్‌ కళ్యాణ్‌ కాదని.. మంచు విషు? అన్నది తాజా కబురు. ఈ విషయాన్ని విషు? తండ్రి మోహన్‌ బాబు కనామ్‌ే చేశారు.

తన పెద్ద కొడుకు కథానాయకుడిగా 'సేనాపతి' అనే సినిమాను నిర్మించబోతున్నట్లు మోహన్‌ బాబు వెల్లడించారు. ఆ సినిమాలో తాను కూడా ముఖ్య పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు. ఈ సినిమాకు దర్శకుడెవరు.. మిగతా వివరాలేంటన్నది తర్వాత చెబుతానన్నారు. దీంతో పాటు మనోజ్‌ కథానాయకుడిగానూ ఓ సినిమా నిర్మించబోతున్నట్లు మోహన్‌ బాబు తెలిపారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బేనర్లో ఈ సినిమాలు తెరకెక్కుతాయని ఆయన చెప్పారు.

'ఆడోరకం ఈడోరకం'తో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్‌ ఖాతాలో వేసుకున్న విషు?.. ప్రస్తుతం 'అడ్డా' ఫేమ్‌ కార్తీక్‌ రెడ్డి దర్శకత్వంలో 'సరదా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విషు? సరసన సోనారికా బడోరియా కథానాయికగా నటిస్తోంది. 'ఆడోరకం ఈడోరకం' తర్వాత విషు? బయటి బేనర్లో చేస్తున్న మరో సినిమా ఇది. దీని తర్వాత వరుసగా సొంత సంస్థలోనే సినిమాలు చేయబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు