శిరీష్ సినిమాకు బంపరాఫర్

శిరీష్ సినిమాకు బంపరాఫర్

మొత్తానికి ఇన్నాళ్లకు టాలీవుడ్లో అల్లు శిరీష్ టైం మొదలైంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే హిట్టు కొట్టి తీరాల్సిన డెస్పరేట్ సిచువేషన్లో ‘శ్రీరస్తు శుభమస్తు’ అతను ఆశించిన ఫలితాన్నిచ్చింది. ఆల్రెడీ ‘పెళ్లిచూపులు’ బాగా ఆడుతున్నా.. పోటీగా విడులైన ‘మనమంతా’కు కూడా మంచి టాక్ వచ్చినా.. ‘శ్రీరస్తు శుభమస్తు’ బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. తొలి రోజు ఓపెనింగ్స్ మరీ గొప్పగా ఏమీ లేవు కానీ.. తర్వాత పుంజుకున్నాయి. శని ఆదివారాల్లో మంచి వసూళ్లు సాధించడమే కాక.. సోమవారం కూడా స్టడీగా నిలబడిందీ సినిమా. ఫుల్ రన్లో ఈ సినిమా పది కోట్లకు పైనే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శిరీష్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఇది పెద్ద నంబరే.

మరోవైపు ‘శ్రీరస్తు శుభమస్తు’కు శాటిలైట్ హక్కుల ద్వారా కూడా బాగానే గిట్టుబాటైనట్లు సమాచారం. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు టీవీల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ సినిమా హక్కుల్ని ఏకంగా రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట జెమిని టీవీ. శాటిలైట్ రైట్స్ విషయంలో స్లంప్ నడుస్తున్న టైంలో ఓ చిన్న సినిమా ఇంత రేటు దక్కించుకోవడమంటే చిన్న విషయం కాదు. ఇక్కడే అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ తెలుస్తుంది. ఓవైపు కొడుకును హీరోగా నిలబెట్టిన ఆనందం.. మరోవైపు మంచి లాభాలు కూడా అందుకోవడంతో ఆయన ఆనందానికి అవధులుండవు. శ్రీరస్తు శుభమస్తు తర్వాత శిరీష్ ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇవి రెండూ బయట నిర్మాతలతో చేస్తున్నవే. ఇకపై శిరీష్ సినిమాల్ని తండ్రే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు