ఈ ఐడియాలు మాఫియాకే...

ఈ ఐడియాలు మాఫియాకే...

కామన్‌గా మన దర్శకులందరూ, ఏదైనా ఉపధ్రువం వచ్చినప్పుడు హీరో వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనే సబ్జెక్టులు తీసుకొని సినిమాలు చేస్తాడు. కాని ఈయన మాత్రం పెద్ద తిరుపతి గుడిని ఎలా ఎటాక్‌ చెయ్యొచ్చు, లేకపోతే మాఫియా వాళ్లు ఇంకెన్ని విధాలుగా దేశాన్ని దోచుకోవచ్చు అనే కాన్సెప్టులతో సినిమాలు తీస్తాడు. ఆయన మన రామ్‌ గోపాల్‌ వర్మ. ఈయన తాజా చిత్రం సత్య-2.

అప్పట్లో వచ్చిన సత్య సినిమా నిజంగా ఒక యువకుడు మాఫియాతో ఎలా చేతులుకలిపాడు, దాని పర్యావసానాలు ఎలా ఉన్నాయ్‌ అనే ఒక జెన్యూన్‌ కథతో తీశాడు. కాని ఈ కొత్త సత్యలో మాత్రం, మాఫియాను కార్పొరేట్‌ స్టయిల్లో ఎలా నడిపించాలి అనే ఒక ఐడియాతో సీన్లు అల్లేశాడట. అంటే మాఫియా వాళ్ళకు ఇప్పటివరకు రాని ఐడియాలను కూడా మనోడు అందిస్తున్నాడనమాట.

శర్వానంద్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు లేవుకాని, సినిమా కాస్త పర్వాలేదని అనిపించుకున్నా ఇటు రాముకి అటు శర్వాకు బ్రేక్‌ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరికీ హిట్లు లేవుగా...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English