రేవంత్‌ కొత్త కోరిక నెరవేరుతుందా..!

రేవంత్‌ కొత్త కోరిక నెరవేరుతుందా..!

తెలంగాణలో అధికార టీఆర్‌ ఎస్‌ సహా సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మీడియాకెక్కే టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి.. పొలిటికల్‌ కెరీర్‌పై పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడంగల్‌ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఎప్పుడు అవకాశం వచ్చినా.. అధికార పార్టీపై రెచ్చిపోయే ఆయన పార్లమెంటు సీటులో కూర్చుని అధ్యక్షా.. అని అనాలని కలలు కంటున్నారట! అంతేకాదు, 2014లోనే ఆయన తన మనసులో మాటను టీడీపీ అధినేత చెవిలో వేశారట. అంతేనా.. పార్లమెంటు నియోజకవర్గాల్లో పెద్దదైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేయాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే, అప్పటికే ఈ స్థానానికి మల్లారెడ్డిని డిసైడ్‌ చేశారు. మల్లారెడ్డి కాస్త ఖర్చు పెట్టే రేంజ్‌లో ఉండడం, పార్టీ ప్రయోజనాల దృష్యా రేవంత్‌కు ఛాన్స్‌ మిస్సయింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ఆకర్ష్‌ మంత్రానికి మల్లారెడ్డి సైకిల్‌ దిగి.. కారెక్కారు. దీంతో రేవంత్‌ రెడ్డి..లో ఆశలు మళ్లీ నీళ్లుపోసుకున్నాయి. చంద్రబాబుకు హ్యాండ్‌ ఇచ్చిన మల్లారెడ్డిపై కసి తీర్చుకోవడం సహా.. తన కలను కూడా నెరవేర్చుకునేందుకు ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్న చందంగా రేవంత్‌ కథ నడిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ క్రమంలో మల్లారెడ్డిపై అనరత వేటు వేయించి, మల్కాజిగిరి నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా చేయాలని ఆ స్థానం నుం చి తాను పోటీకి దిగాలని రేవంత్‌ పక్కా వ్యూహంతో ఉన్నారు. ఇదే విషయాన్ని రేవంత్‌ సన్నిహితులతో అన్నారట. ఒకవేళ తాను బరిలోకి దిగితే అటు కాంగ్రెస్‌, భాజపాల నుంచి తనకి సపోర్టు దక్కుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి తేదేపా ఫైర్‌ బ్రాండ్‌ ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూడాలి. మరోపక్క, రేవంత్‌ ఆశలపై చంద్రబాబు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English