శిరీష్‌కు ఇదే తొలి సినిమా అట..

శిరీష్‌కు ఇదే తొలి సినిమా అట..

అల్లు శిరీష్ ఇప్పటికే గౌరవం, కొత్త జంట అనే రెండు సినిమాలు చేశాడు. అందులోనూ ‘కొత్తజంట’ చిత్రాన్ని అల్లు అరవిందే స్వయంగా నిర్మించారు. ఐతే తన దృష్టిలో మాత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’నే శిరీష్ డెబ్యూ మూవీ అంటున్నాడు అతడి అన్న అల్లు అర్జున్. తామందరం ‘శ్రీరస్తు శుభమస్తు’తోనే శిరీష్‌ను లాంచ్ చేస్తున్నట్లగా ఫీలయ్యామని.. ఈ సినిమాతో అతను సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకోవడం అన్నయ్యకు తనకు ఎంత ఆనందాన్నిస్తోందో చెప్పలేనని బన్నీ అన్నాడు.

‘‘ఒక సినిమా హిట్టు కావడం అన్నది దర్శకుడి మీదే ఆధారపడి ఉంటుంది. మిగతా విభాగాలు ఎంత చేసినా.. దర్శకుడి పనితనం బాగుంటేనే సినిమా హిట్టవుతుంది. ‘శ్రీరస్తు శుభమస్తు హిట్టయిందంటే ఆ క్రెడిట్ అంతా పరశురామ్ గారిదే. ‘శ్రీరస్తు శుభమస్తు’ మా ఫ్యామిలీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మా తమ్ముడికిది డెబ్యూ సినిమాలాగా.. అతణ్ని హీరోగా లాంచ్ చేస్తున్నట్లుగా ఫీలయ్యాం. ఇలాంటి సినిమాను చాలా బాధ్యతగా ఫీలై చేసి.. హిట్టు అందించాడు పరశురామ్.

మా తమ్ముడి కెరీర్‌కు ఓ రోడ్డు వేసిన పరశురామ్‌కు మా కుటుంబం తరఫున కృతజ్నతలు చెబుతున్నా. ఇక మా నాన్న గురించి నేను చెప్పకూడదు. ఆయన చూడని సక్సెస్ లేదు. ఐతే ఈ సినిమా తర్వాత ఏది హిట్టవకపోయినా పర్వాలేదు కానీ.. ఇది మాత్రం హిట్టయి తీరాల్సిందే అని చెప్పాను. ఆయన ఈ సినిమాకు కష్టపడ్డ విధానం చూశాక.. 20 ఏళ్ల తర్వాత నా కొడుకు విషయంలో నేనేం చేయాలో.. ఏ రేంజిలో సపోర్ట్ చేయాలో నాకు అర్థమైంది’’ అని బన్నీ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు