ముందే ఫ్లాప్ అని వెంకీకి తెలిసినా..

ముందే ఫ్లాప్ అని వెంకీకి తెలిసినా..

కొన్ని సినిమాలు తెర మీద చూస్తున్నపుడు.. ఇలాంటి సినిమాను ఆ హీరో ఎలా ఒప్పుకున్నాడో.. ఆ నిర్మాత ఎలా డబ్బులు పెట్టాడో.. ఆ డైరెక్టర్ అందరినీ ఎలా ఒప్పించి ఈ సినిమా చేయగలిగాడో అనిపిస్తూ ఉంటుంది. తీస్తున్నపుడు ఏమీ తేడాగా అనిపించలేదా అని కూడా సందేహం కలుగుతుంటుంది. ఇలాంటి కళాఖండాలు ప్రతి హీరో కెరీర్లోనూ ఉంటాయి. విక్టరీ వెంకటేష్ కు కూడా అలాంటి డిజాస్టర్లు కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాలు చేస్తున్నపుడు మీకు ఏమీ అనిపించలేదా అని అడిగితే.. అలా అనిపించి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాజీ పడిపోయానంటున్నాడు వెంకీ.

‘‘కొన్నిసార్లు సినిమా బాగా రావట్లేదు అనిపిస్తే వెంటనే దర్శకుడికి చెబుతుంటాను. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే అవి ఆడవని నాకు అర్థమయ్యేది. ఓ నటుడికి అలాంటి పరిస్థితి రావడం చాలా ఇబ్బందికరమే. చెప్పలేక కక్కలేక ఇబ్బంది పడుతుంటాం. ఎటూ వెళ్లలేం. కొన్నిసార్లు తప్పక రాజీ పడాల్సి వస్తుంది కూడా. ఎప్పుడు ఎలాంటి మ్యాజికల్ థింగ్స్ జరుగుతాయో తెలియదు కాబట్టి కొన్నిసార్లు ఓపిగ్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది’’ అని వెంకీ చెప్పాడు. ఐతే తన కొత్త సినిమా ‘బాబు బంగారం’ మీద మాత్రం తనకు ముందు నుంచి చాలా గట్టి నమ్మకం ఉందని.. మారుతి తనకు ఈ పాత్ర గురించి చెప్పగానే బాగా నచ్చేసిందని.. కొత్తగా అనిపించిందని.. సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందని వెంకీ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English