మారుతి కోడి లాంటి వాడు - వెంకీ

మారుతి కోడి లాంటి వాడు - వెంకీ

మారుతి దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా నటించిన బాబు బంగారం ఈ చిత్రం ఈనెల 12న గ్రాండ్‌ గా రిలీజ్‌ అవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో రాధ అనే చిత్రం ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా చేయడం పై వెంకటేష్‌ స్పందించాడు. తాను గానీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌ గానీ... డైరెక్టర్స్‌ ట్రాక్‌ రికార్డ్స్‌, హిట్‌, ఫ్లాప్స్‌ చూసి సినిమాలు ఓకే చేయమన్నాడు. కథ బాగుందా లేదా.. బిజినెస్‌ పరంగా వర్కవుట్‌ అవుతుందా లేదా అన్నదే మెయిన్‌ క్రైటీరియా అని అంటున్నాడు వెంకీ. బాబు బంగారం ప్రమోషన్లో భాగంగా మారుతిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

మారుతి చాలా కూల్‌ గా ఉంటాడు. టెన్షన్‌ పడడు. చాలా క్లారిటీగా ఉంటాడు. ఎంత వర్క్‌ ఉన్నా కన్ఫూజ్‌ అవ్వడు. అంత కూల్‌ గా ఉండి పని చేయించుకోవడం చాలా కష్టం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్‌ ఉంటారలా. అప్పట్లో కోడి రామకృష్ణ గారు ఉండేవారు అలా. రాధ అనే సినిమా చేయకపోయినా... నాతోనే సినిమా చేయాలనే మారుతి కమిట్‌ మంట్‌ బాగా నచ్చింది. మారుతి మళ్లీ నన్ను చాలా ఫ్రెష్‌ గా చూపించాడు. బొబ్బిలి రాజా చిత్రం మారుతికి చాలా ఇష్టం. చాలా సార్లు చూశాడట. అందుకే ఆ చిత్రంలోని డైలాగ్‌ ను ఓ యాక్షన్‌ పార్ట్‌ లో వాడాం. బాగా వర్కవుట్‌ అయ్యింది. సాంగ్‌ ని కూడా ఉపయోగించాం. నేను పోలీసాఫీసర్‌ క్యారెక్ట్రర్‌ చేశాను. జాలి పడుతూ ఉండే క్యారెక్టర్‌. ఇప్పటికీ అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్‌ కు రెస్పాన్స్‌ ఇంత బాగా వస్తుందనుకోలేదు. బాబు బంగారం అనే టైటిల్‌ మారుతి సూచించిందే. ఇక కెరీర్‌ మొదలు పెట్టి ముప్పై ఏళ్లయ్యిందని పొగుడుతున్నారు...చాలా సంతోషంగా ఉంది. కానీ నేను అలాంటి నెంబర్స్‌ ని పట్టించుకోను. జనాలు మనల్ని స్క్రీన్‌ మీద చూస్తున్నారా లేదా అన్నదే చూస్తాను. లక్కీగా ముప్పై ఏళ్లుగా చూస్తున్నారు. మన పని మనం చేసుకుపోవడమే. అంటూ తనదైన స్టైల్లో స్పందించాడు బంగారు బాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English