ఈ రూమర్ నిజమేనా వెంకీ?

ఈ రూమర్ నిజమేనా వెంకీ?

బుల్లితెర యాంకర్ ఓంకార్‌ను అభిమానించే వాళ్లు ఎంతమంది ఉంటారో.. అతడిని వ్యతిరేకించేవాళ్లు అంతకంటే ఎక్కువమందే ఉంటారు. బుల్లితెరపై రియాల్టీ షోల్ని సరికొత్త మలుపు తిప్పిన ఘనత ఓంకార్‌దే. ఐతే ఈ షోలను డ్రామాలుగా మార్చేశాడని అతడిపై తీవ్ర విమర్శలు గుప్పించేవాళ్లున్నారు. యూట్యూబ్‌లో ఓంకార్ పేరు కొడితే అతణ్ని వెటకారం చేసే వీడియోలే ఎక్కువ కనిపిస్తాయి. ఐతే ఈ నెగెటివిటీని అసలేం పట్టించుకోకుండా బుల్లితెర నుంచి వెండితెరకు కూడా వెళ్లాడు ఓంకార్. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో తీసిన ‘జీనియస్’ దెబ్బ కొట్టినా.. ‘రాజు గారి గది’తో తనేంటో రుజువు చేసుకున్నాడు ఓంకార్. చిన్న సినిమాగా విడుదలై పెద్ద రేంజికి వెళ్లిందీ సినిమా.

‘రాజు గారి గది’ హిట్టవగానే దానికి సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు అప్పట్లోనే ప్రకటించిన ఓంకార్.. ఆల్రెడీ అందుకోసం స్క్రిప్టు కూడా పూర్తి చేసేశాడట. సీక్వెల్‌ను భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఓంకార్.. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్‌ను హీరోగా పెట్టుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే వెంకీకి స్క్రిప్టు కూడా చెప్పినట్లు సమాచారం. మరి వెంకీ ఒప్పుకున్నాడో లేదో తెలియదు. ఆయన కనుక ఓకే అంటే అది హాట్ న్యూసే అవుతుంది. వెంకీ గత కొన్నేళ్లుగా ఆశ్చర్యకరమైన ప్రాజెక్టులు ఎంచుకుంటున్నాడు. దర్శకుల్లో చిన్నా పెద్దా అని చూడట్లేదు. ఆ క్రమంలోనే ఓంకార్‌కు కూడా ఛాన్స్ ఇచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో వెయిట్ చేద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English