గ్యారేజ్ టీం క్రియేటివిటీతో కుమ్మేస్తుందట

గ్యారేజ్ టీం క్రియేటివిటీతో కుమ్మేస్తుందట

జనతా గ్యారేజ్.. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది తెలుగు పరిశ్రమలో. జనతా గ్యారేజ్ అనే క్యాచీ టైటిల్.. దానికి కొనసాగింపుగా ‘ఇచట అన్ని రిపేర్లు చేయబడును’ అనే ట్యాగ్ లైన్, 90ల సినిమాల్ని తలపించేలా డిజైన్ చేసిన టైటల్ లోగో, ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్.. అన్నీ కూడా జనాల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగించాయి. ఆడియో వేడుక పోస్టర్ల మీద ‘ఇచట పాటలు కూడా వినిపించబడును’ అంటూ వేసిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంది. ఇక ఆడియో వేడుక కూడా చాలా క్రియేటివ్‌గా.. ఆసక్తికరంగా చేయడానికి సన్నాహాలు చేసుకుంటోందట ‘గ్యారేజ్’ టీం.

‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ ఇన్విటేషన్ల కోసం స్పెషల్ డిజైన్స్ రెడీ చేస్తున్నారట. కారు టైరు రిమ్ మోడల్లో.. స్పానర్ల మోడల్లో ఇన్విటేషన్లను తయారు చేస్తున్నట్లు సమాచారం. స్పానర్ల ఆకారంలో ఉండే ఇన్విటేషన్లను అభిమానులకు పంచి.. రిమ్ ఆకారంలో ఉన్నవాటిని ఇండస్ట్రీ జనాలకు ఇస్తారట. ఆడియో వేడుక కూడా ఒక కాన్సెప్ట్ ప్రకారం క్రియేటివ్‌గా జరుగుతుందని చెబుతున్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఆడియో ఇచ్చాడంటూ ఇప్పటికే యూనిట్ సభ్యులు పాటల గురించి ఓ రేంజిలో చెబుతున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం తెలుగు-మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు