అందుకే మోహన్‌ లాల్‌ ను తీసుకున్నారా..?

అందుకే మోహన్‌ లాల్‌ ను తీసుకున్నారా..?

మనమంతా సినిమా విడుదలై విజయం దిశగా అడుగేస్తోంది. ఈ సినిమాకు ప్రశంసల వర్షం కూడా అలాగే కురుస్తోంది. ముఖ్యంగా మోహన్‌ లాల్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి అనుమానం ఒక్కటే. తెలుగులో ఇంత మంది నటులుండగా.. చంద్రశేఖర్‌ యేలేటి ఎక్కడో మళయాలంలో ఉన్న మోహన్‌ లాల్‌ ను ఈ పాత్ర కోసం ఎందుకు తీసుకున్నాడు..? మనమంతా సినిమాలో నటించడానికి మన దగ్గర నటులే లేరా..? ఈ పాత్రలో ఒదిగిపోయే స్టార్‌ మన దగ్గర దొరకరా..?

ఈ ప్రశ్నలకు సమాధానం మనమంతా సినిమా చూస్తే అర్థమైపోతుంది. మోహన్‌ లాల్‌ సాయిరాం పాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోయాడో తెలుస్తోంది. అంతేకాదు.. మోహన్‌ లాల్‌ చేసిన ఈ పాత్రలో మన హీరోల్ని కనీసం ఎవ్వర్నీ ఊహించుకోలేం కూడా. అంత అద్భుతంగా నటించాడాయన. అసలు ఈ కథ మన హీరోలకు యేలేటి చెప్పాడా.. లేదంటే ఎవ్వరూ ఒప్పుకోరని వదిలేసాడా అనే విషయం మాత్రం సస్పెన్సే. ఎందుకంటే మనోళ్లకు ఇమేజ్‌ చాలా ముఖ్యం. ఇలాంటి మిడిల్‌ క్లాస్‌ పాత్రలు.. తండ్రి పాత్రలు వేస్తే ఎక్కడ తమ ఇమేజ్‌ గంగలో కలిసిపోతుందేమో అని భయం. అందుకే మన దగ్గర ఇంత మంది నటులున్నా.. మోహన్‌ లాల్‌ ను తీసుకొచ్చాడు యేలేటి. ఈయన ఉండటంతో తెలుగుతో పాటు తమిళ, మళయాల ఇండస్ట్రీల్లో కూడా మనమంతా మంచి విజయం దిశగా పయనిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English