వాళ్లిద్దరూ ఫామ్‌ లోకి వచ్చారు..!

వాళ్లిద్దరూ ఫామ్‌ లోకి వచ్చారు..!

ఆ ఇద్దరు దర్శకులు టాలెంటెడే.. ఇద్దరూ తమను తాము నిరూపించుకున్నోళ్లే. కాకపోతే కాలమే వారిపై కాస్త కన్నెర్ర చేసింది. దాంతో ఫ్లాపుల జడిలో పడిపోయారు. వాళ్ళే ఒకరు చంద్రశేఖర్‌ యేలేటి.. మరొకరు పరుశురామ్‌. ఐతే సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న దర్శకుడు యేలేటి. తాను ఎలాంటి సినిమాలు చేస్తాడో.. ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కమర్షియల్‌ గా హిట్టైనా కాకపోయినా చంద్రశేఖర్‌ యేలేటి మాత్రం తన దారి మార్చుకోడు. తాను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకురాడు. చావైనా.. బతుకైనా అందులోనే అంటాడు. సాహసం సినిమా కమర్షియల్‌ గా సక్సెస్‌ కాకపోయినా.. ఇప్పుడు మరోసారి మనమంతా అంటూ డిఫెరెంట్‌ కాన్సెప్ట్‌ తో వచ్చాడు.ఇన్నాళ్లూ సస్పెన్స్‌, లవ్‌ లాంటి కథలు చేసిన యేలేటి.. మనమంతాలో చక్కటి ఎమోషన్‌ చూపించాడు. ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ నటనతో పాటు యేలేటి దర్శకత్వ ప్రతిభకు నీరాజనాలు పడుతున్నారు.

ఇక పరుశురామ్‌ కూడా తొలి సినిమా యువతతోనే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆంజనేయులు కమర్షియల్‌ గా ఫ్లాపైనా.. పరుశురామ్‌ కామెడీ టైమింగ్‌ కు అద్దం పట్టింది. సోలోతో ఫామ్‌ లోకి వచ్చిన పరుశురామ్‌.. సారొచ్చారుతో గాడి తప్పాడు. మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తుతో మరోసారి సత్తా చూపించాడు ఈ దర్శకుడు. పాత కథనే తన మాటలతో మాయ చేసాడు పరుశురామ్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌ బొమ్మరిల్లు తరహాలోనే సాగినా.. తన డైలాగ్స్‌ తో అందర్నీ మాయ చేసాడు పరుశురామ్‌. మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులు మళ్లీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారిపోయారు ఇండస్ట్రీలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English