పవన్ సినిమా.. ఈ సస్పెన్స్ ఏంటో?

పవన్ సినిమా.. ఈ సస్పెన్స్ ఏంటో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఆగస్టు 6న షూటింగ్ మొదలుపెట్టేశారు. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే విషయంలో రెండు మూడు డేట్లు దాటిపోవడం.. అసలీ సినిమా ఉంటుందా లేదా అని సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈసారి కూడా సినిమాను మొదలుపెట్టకపోతే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో మొక్కుబడిగా షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఐతే తొలి రోజు షూటింగులో పవన్ పాల్గొనలేదు. అసలు ఈ షెడ్యూల్ ఎన్నో రోజులేమీ జరిగిపోదు. రెండు రోజుల్లో ముగిసిపోతుంది. పవన్ రెండు వారాల తర్వాత షూటింగ్‌లోకి అడుగుపెడతాడు. ఆ షెడ్యూల్ మాత్రం ఎక్కువ రోజులే జరుగుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది తమిళ హిట్ మూవీ ‘వీరం’కు అనఫీషియల్ రీమేక్ అంటారు. అదేం కాదు కొత్త కథ అని కూడా అంటారు. ఈ సినిమాకు ముందుగా అనుకున్న దర్శకుడు ఎస్.జె.సూర్య ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో అప్పట్లో మాట్లాడుతూ పవన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పిన ఇండికేషన్స్ చూస్తే మాత్రం ఇది ‘వీరం’ కథలాగే అనిపించింది. మిడిలేజ్డ్ ఫ్యాక్షన్ లీడర్.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే ఈ కథ అన్నాడు. ‘వీరం’ కథ అయితే దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఈ రోజుల్లో ఓ సినిమా రీమేకా కాదా అనే విషయంలో దాపరికం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. జనాలు విషయం ఈజీగా పసిగట్టేస్తారు. కాబట్టి రీమేక్ ముచ్చటేదో ముందే చెప్పేస్తే వ్యవహారం క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. మరి పవన్ అండ్ కో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు