అమ‌లా పాల్ సైలెంటుగా..

అమ‌లా పాల్ సైలెంటుగా..

ఓప‌క్క అమ‌లా పాల్ కు వ్య‌తిరేకంగా ఆమె భ‌ర్త.. ఆమె మామ మీడియాకెక్కి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఐతే ఆమె మాత్రం ఒక్క మాటా మాట్లాడకుండా సైలెంటుగా త‌న ప‌ని తాను చేసుకుపోయింది. విడాకుల వార్త‌ల‌పై.. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ఒక్క మాటా మాట్లాడ‌ని అమ‌లా.. శనివారం ఉద‌యం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిష‌న్ వేసింది. విజ‌య్ సైతం మ్యూచువ‌ల్ క‌న్సంట్ తో అమ‌ల నుంచి విడిపోవ‌డానికి పిటిష‌న్ వేసిన‌ట్లు స‌మాచారం. దీంతో అమ‌ల‌-విజ‌య్ త్వ‌ర‌లోనే విడిపోనున్నారని తేలిపోయింది. కొన్ని నెల‌ల్లోనే ఈ ప్ర‌క్రియ ముగిసిపోవ‌చ్చు.

సింధు స‌మ‌వేలి అనే బి-గ్రేడ్ సినిమాతో క‌థానాయిక‌గా పాపుల‌ర్ అయింది అమ‌లా. ఆ త‌ర్వాత మైనా సినిమా ఆమెకు ఎన‌లేని పేరు తెచ్చిపెట్టింది. అక్క‌డి నుంచి హీరోయిన్ గా ఆమెను మంచి మంచి పాత్ర‌లు వ‌రించాయి. టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మ‌రోవైపు విజ‌య్ ద‌ర్శ‌కుడిగా అజిత్ హీరోగా కిరీటం అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. నాన్న‌.. శైవం లాంటి సినిమాలు అత‌డికి మంచి పేరు తెచ్చాయి. నాన్న సినిమా సంద‌ర్భంగానే వీళ్లిద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంది. త‌ర్వాత త‌లైవా అనే ఇంకో సినిమా చేశారు. అప్పుడే వాళ్లిద్దరి బంధం బలపడింది. 2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు