కొత్త సినిమాలు.. పెళ్లిచూపులు.. పోలికే లేదు

కొత్త సినిమాలు.. పెళ్లిచూపులు.. పోలికే లేదు

తెలుగు సినిమాల మార్కెట్ అందు అమెరికా మార్కెట్ వేరు. వాళ్ల టేస్టు కొంచెం డిఫరెంటుగా ఉంటుంది. నాని లాంటి చిన్న హీరో సినిమాలకు అక్కడి వాళ్లు బ్రహ్మరథం పడతారు. నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లాంటి బడా హీరోల సినిమాల్ని పట్టించుకోరు. వాళ్ల టేస్టు అలా ఉంటుంది మరి. భారీ కాంబినేషన్ల కంటే కూడా సినిమా తమ టేస్టుకు తగ్గట్లుగా ఉందా లేదా అనే చూస్తారు అక్కడి జనాలు. వారం కిందట ‘పెళ్లిచూపులు’ పేరుతో ఓ చిన్న సినిమా వస్తే.. అందులో హీరో హీరోయిన్లు ఎవరు, దర్శకుడెవరు అని చూడకుండా కంటెంట్ మాత్రమే చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా అమెరికాలో ప్రభంజనమే సృష్టిస్తోంది.

కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసేయడం విశేషం. ఈ వారం కొత్తగా వచ్చిన రెండు సినిమాలపైనా ‘పెళ్లిచూపులు’ డామినేషన్ చూపిస్తోంది. గురువారం ఈ రెండు సినిమాలకు ప్రిమియర్లు వేయగా.. శ్రీరస్తు శుభమస్తు 4 వేల డాలర్లు.. మనమంతా 5500 డాలర్లు మాత్రమే వసూలు చేశాయి. కానీ అదే రోజు పెళ్లిచూపులు సినిమా 32 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రిమియర్లు కాబట్టి కలెక్షన్లు తక్కువున్నాయనడానికేమీ లేదు. ఈ రెండు సినిమాల్లోనూ నోటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ఉన్నారు. ఇవేమీ లేకుండానే ‘పెళ్లిచూపులు’ ప్రిమియర్ షోల ద్వారా 18 వేల డాలర్ల దాకా తెచ్చింది. తర్వాత తొలి రోజు కలెక్షన్లు అనూహ్యంగా రైజ్ అయి 50 వేల డాలర్లు దాటాయి. మరి శ్రీరస్తు శుభమస్తు, మనమంతా సినిమాల కలెక్షన్లలో ఏమాత్రం గ్రోత్ ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English