నమ్రత మళ్లీ మేకప్‌ వేసుకుంటోందా?

నమ్రత మళ్లీ మేకప్‌ వేసుకుంటోందా?

బాలీవుడ్‌లో పాపులర్‌ హీరోయిన్‌గా వెలిగిన నమ్రతా శిరోద్కర్‌ తెలుగులోను వంశీ, అంజిలాంటి చిత్రాల్లో నటించింది. మహేష్‌తో ప్రేమలో పడి, అతడిని పెళ్లాడిన తర్వాత పూర్తిగా నటనకి స్వస్తి చెప్పి భర్త వ్యవహారాలని, వ్యాపార లావాదేవీలని చక్కబెడుతోన్న నమ్రత మళ్లీ ఇన్నాళ్లకు తెర మీదకి రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్‌తో మురుగదాస్‌ తీస్తోన్న చిత్రంలో కాసేపు కనిపించే ఒక కీలక పాత్రలో నమ్రత నటిస్తోందని ఫిలింనగర్‌లో పుకార్లు బాగా షికారు చేస్తున్నాయి. ఇంతవరకు ఈ వార్తని అధికారికంగా ప్రకటించడం కానీ, వస్తోన్న పుకార్లని ఖండించడం కానీ జరగలేదు. కానీ నమ్రత ఇందులో నటిస్తోందనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. పెళ్లి తర్వాత కొంతకాలం కుటుంబానికే కేటాయించిన జ్యోతిక మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకుంటే సూర్య ఆమెని ప్రోత్సహించాడు.

భార్య మళ్లీ నటిగా బిజీ కావడానికి తనవంతు సహకారం అందించాడు. ఆ జంట నుంచి ఇన్‌స్పయిర్‌ అయి మహేష్‌, నమ్రత కూడా ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇది పూర్తిగా ఆధారం లేని గాలి వార్తేనా అనేది తేలాల్సి వుంది. ఒకవేళ నమ్రత మళ్లీ నటిస్తే మాత్రం ఇప్పటికే వీర హైప్‌ ఉన్న మహేష్‌, మురుగదాస్‌ సినిమాకి మరికొంత బజ్‌ పెరుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English