నిఖిల్ నిహారికను వద్దన్నాడా?

నిఖిల్ నిహారికను వద్దన్నాడా?

బుల్లెతెరపై యాంకర్‌గా సత్తా చాటుకుని.. వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్ టాలెంట్ చూపించిన కొణిదెల నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో వెండితెర మీదికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. కానీ అనుకున్నదొకటి అయినది ఒక్కటి అన్నట్లు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో విడుదల తర్వాత అసలెక్కడా కనిపించలేదు నిహారిక. ఆమె నటన విషయంలో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినా.. కనీసం ఆ విషయం మీద కూడా స్పందించలేదు. ఈ మధ్యే ఓ మరాఠీ సినిమా రీమేక్‌లో నిహారిక నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ వార్తల్ని నిహారిక వైపు నుంచి ఖండించారు. ఇంకో డైరెక్ట్ మూవీతోనే నిహారిక తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలని భావిస్తన్నట్లు చెబుతున్నారు.

ఐతే నిహారిక గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో రౌండ్లు కొడుతోంది. తాజాగా ఓ స్క్రిప్టు విని ఇంప్రెస్ అయిన నిహారిక, ఆమె తండ్రి నాగబాబు.. యువ కథానాయకుడు నిఖిల్‌ను ఈ సినిమాకు హీరోగా అడిగారట. ఐతే స్క్రిప్టు విన్నాక అతను ఈ సినిమా చేయడానికి నిరాకరించాడట. నిహారికతో నటించడానికి ఇబ్బందేమీ లేదని.. ఐతే తనకు స్క్రిప్టు సంతృప్తినివ్వలేదని అతను తేల్చి చెప్పేశాడట. దీంతో హీరోను మార్చుకోవాలా.. లేక స్క్రిప్టు మార్చుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నారట నిహారిక-నాగబాబు. ముందు ఈ స్క్రిప్టు నచ్చడంతో తనే స్వయంగా కూతురి కోసం ఈ సినిమాను నిర్మించాలని కూడా అనుకున్నాడట నాగబాబు. కానీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు