బాంబుల‌తో సిద్ధ‌మైన అమ‌లాపాల్‌

బాంబుల‌తో సిద్ధ‌మైన అమ‌లాపాల్‌

స్వయంగా ఓ దర్శకుడు అయి ఉండి తన భార్యను సినిమాల్లో నటించనివ్వకుండా హద్దులు పెడుతున్నాడా అంటూ అందరూ ఎ.ఎల్.విజయ్ ను తిట్టుకుంటూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. సినిమాల్లో నటించొద్దన్న ఆదేశాల్ని పాటించకపోవడం వల్లే అమలా పాల్ ను వద్దనుకున్నామంటూ విజయ్ తండ్రి అళగప్పన్ చేసిన వ్యాఖ్యలు ఆ కుటుంబం మీద జనాల్లో వ్యతిరేకతను పెంచాయి. తన తండ్రి వ్యాఖ్యలతో తన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని గుర్తించిన విజయ్.. అప్రమత్తం అయ్యాడు. అమలతో విడిపోవడానికి ఆమె సినిమాల్లో నటించడం ఎంత మాత్రం కారణం కాదని తేల్చి చెప్పాడు. ‘నమ్మకం కోల్పోవడమే’ తమ బంధం తెగిపోవడానికి కారణమని చెప్పాడు. పరోక్షంగా తప్పు అమల వైపే ఉందని చెప్పకనే చెప్పాడు విజయ్.

ఐతే మొన్న విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలతో అమల మీద అందరికీ సింపతీ వచ్చింది. స్వయంగా ఓ దర్శకుడై ఉండి అమలను నటించకుండా అడ్డుకోవడం ఏంటి అని ఆమెకు మద్దతుగా మాట్లాడారు అందరూ. ఐతే విజయ్ ఇచ్చిన ప్రకటన చూశాక అమల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమల ఇక మౌనం వీడాల్సిన టైం వచ్చేసింది. ఆమె కూడా విజయ్ తరహాలోనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. విజయ్ లాగా కాకుండా కొంచెం గట్టిగానే ఆమె అటాక్ చేసే అవకాశాలున్నాయి. అమలకు అత్తింటి వేధింపులు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తన అత్తింటి వారిని.. విజయ్ ను టార్గెట్ చేస్తూ అమల ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతోందట. ఇందులో బాంబుల్లా పేలే అంశాలుంటాయంటున్నారు.రేపో ఎల్లుండో అమల ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు