కెరియర్‌ నాశనం చేసుకుంటోన్న సునీల్‌

కెరియర్‌ నాశనం చేసుకుంటోన్న సునీల్‌

కమెడియన్‌ నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌కి ఇప్పుడు చాలా మంచి మార్కెట్‌ వుంది. అతని సినిమాలకి ఓపెనింగ్స్‌ ఎప్పుడూ భలేగా వస్తాయి. మాస్‌ అతడిని ఎంత ఇష్టపడతారనే దానికి సింగిల్‌ థియేటర్లలో వచ్చే వసూళ్లే సాక్ష్యం. అయితే తనకున్న మార్కెట్‌ని, ఇమేజ్‌ని సునీల్‌ దుర్వినియోగం చేసుకుంటున్నాడు. తననుంచి కామెడీ సినిమాలు ఆశించే జనాలని సునీల్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఎనభైల కాలంలో వచ్చిన మూస సినిమాలని పోలిన చిత్రాలు చేస్తూ సునీల్‌ ఫ్లాపులు కొని తెచ్చుకుంటున్నాడు.

కామెడీ ప్రధాన కథలు చెబితే రిజెక్ట్‌ చేస్తున్న సునీల్‌ యాక్షన్‌, రొమాన్స్‌ తప్పకుండా ఉండాలని చెబుతున్నాడట. అలా అతని దగ్గరకి వచ్చిన కథలు సునీల్‌ ఇష్టానికి తగ్గట్టుగా షేప్‌ మారిపోతున్నాయట. ఫైనల్‌గా ఆ సినిమాలు తీరు తెన్ను లేకుండా తయారవుతూ ఎటూ కాకుండా పోతున్నాయని, సునీల్‌ తన తీరు మార్చుకోవాలని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. కామెడీ సినిమా చేస్తే ఇరవై కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న సునీల్‌ మాస్‌ హీరో అవ్వాలనే మోజుతో కెరియర్‌ చేజేతులా నాశనం చేసుకుంటున్నాడనేది అతనిపై ఉన్న ఆరోపణ. దీనికి సునీల్‌ ఏమంటాడో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు