అతను మారుతి కాదు బెంజ్‌!

అతను మారుతి కాదు బెంజ్‌!

డైరెక్టర్‌ మారుతి ఇప్పటికే తన పేరునో బ్రాండ్‌ చేసేసుకున్నాడు. సగటు సినీ ప్రేక్షకులకి అతని పేరు ఎంత ఆకర్షణీయం అనేది తెలియదు కానీ బిజినెస్‌ వర్గాలకి మాత్రం అతనో అయస్కాంతం. ఫలానా సినిమాతో మారుతి అసోసియేట్‌ అయ్యాడంటే ఇక దానిని కళ్లు మూసుకుని కొనేస్తారు. అంతగా తన జడ్జిమెంట్‌ మీద, టాలెంట్‌ మీద నమ్మకం కలిగించిన మారుతి 'భలే భలే మగాడివోయ్‌'తో మరింత పెద్ద స్థాయికి వెళ్లాడు. ఇప్పుడు వెంకీతో అతను తీస్తోన్న 'బాబు బంగారం' సినిమా ఇరవై ఏడు కోట్ల బిజినెస్‌ చేసిందంటే దానికి మారుతినే కారణం. వెంకీ సోలోగా చేసిన సినిమాల్లో ఏదీ ఈమధ్య పదిహేను కోట్లు దాటి బిజినెస్‌ చేయలేదు.

దీనిని బట్టి మారుతి బ్రాండ్‌ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలకి అనుకూలంగా తక్కువ బడ్జెట్‌లో, వేగంగా సినిమా పూర్తి చేసేయడం మారుతి స్టయిల్‌. దీంతో అతనితో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఆశ పడుతున్నారు. పేరుకి మారుతి కానీ అతని సినిమాల రేంజ్‌ మాత్రం బెంజ్‌ అని ఇప్పటికే ఇండస్ట్రీలో మారుతిపై సరదా జోకులు కూడా పడుతున్నాయి. ఇంతవరకు స్టార్‌ హీరోతో పని చేయకుండానే తన సినిమాలకి ముప్పయ్‌ కోట్ల మార్కెట్‌ తెచ్చాడంటే మాటలు కాదు. శభాషయ్యా మారుతీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు