ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ ఇదేనా?

ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ ఇదేనా?

50 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసి.. 50 కోట్లు వసూళ్లు రాబడితే ప్రయోజనం ఏంటంటూ ఆ మధ్య అక్కినేని నాగార్జున మంచి మాట చెప్పాడు. పెట్టుబడి ఎంత.. వసూళ్లు ఎంత అన్నదాన్ని బట్టే ఓ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పగలం. ఆ కోణంలో చూస్తే ఈ ఏడాదికి ‘క్షణం’ సినిమానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆ చిత్రానికి పబ్లిసిటీ ఖర్చులతో కలిపితే రూ.2 కోట్లు బడ్జెట్ అయింది. సినిమా రూ.10 కోట్లకు పైనే వసూలు చేసింది. ఇప్పుడు ‘క్షణం’ను బీట్ చేసే సినిమా వచ్చింది. అదే.. పెళ్లిచూపులు. ఈ సినిమాకు పబ్లిసిటీతో కలిపి అయిన ఖర్చు రూ.1.5 కోట్లు మాత్రమే. కానీ వసూళ్లు దానికి పది రెట్లు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.

విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘పెళ్లిచూపులు’ సినిమా.. రిలీజ్ తర్వాత మరింతగా ప్రశంసలందుకుంది. సామాన్య ప్రేక్షకులకు తోడు సెలబ్రెటీలు కూడా ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. రాజమౌళి లాంటి వాళ్ల ప్రశంసలు ఈ సినిమాకు పెద్ద బూస్ట్ అనడంలో సందేహం లేదు. దీంతో సినిమాకు అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వీకెండ్ తర్వాత.. సోమవారం కూడా సినిమాకు చాలా వరకు హౌస్ ఫుల్స్ పడుతుండటం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే ఈ సినిమా రూ.5 కోట్ల దాకా వసూలు చేసినట్లు అంచనా. అమెరికాలో మాత్రమే ఫస్ట్ వీకెండ్లో కోటిన్నర దాకా వసూళ్లు రావడం విశేషం. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.15 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశముంది. షేర్ మాత్రమే రూ.10 కోట్లకు పైనే రావచ్చు. ఈ లెక్కన చూస్తే ‘పెళ్లిచూపులు’ సినిమానే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అన్నమాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు