ఆక్కడ బాహుబలి.. సౌండ్ లేదేంటి?

ఆక్కడ బాహుబలి.. సౌండ్ లేదేంటి?

బాహుబలి సినిమాకు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులూ బ్రహ్మరథం పట్టారు. విదేశాల్లోనూ ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కింది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా పేరే పెద్దగా వినిపించని దేశాల్లో కూడా ఈ సినిమాను ఆదరించారు. అలాగని విడుదల చేసిన ప్రతిచోటా ‘బాహుబలి’ని నెత్తిన పెట్టుకుంటున్నారంటే పొరబాటే. ఆ మధ్య జర్మనీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే అక్కడి జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇంకా ఒకట్రెండు దేశాల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఐతే అవేమీ పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు కానీ.. చైనాలో ‘బాహుబలి’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడమే ఆశ్చర్యం.

చైనా మార్కెట్ చాలా పెద్దది కావడంతో ‘బాహుబలి’ చైనీస్ డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు చిత్ర నిర్మాతలు. ప్రమోషనూ బాగా చేశారు. రిలీజ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇంతవరకూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కాని స్థాయిలో ఏకంగా 6500 థియేటర్లలో ‘బాహుబలి’ విడుదలైందక్కడ. ఐతే సినిమాకు అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఓవరాల్ కలెక్షన్లు కూడా అంతంతమాత్రమే. వంద కోట్లు ఈజీగా తెచ్చేస్తుందనుకున్న సినిమా అందులో సగం రాబట్టడం కూడా కష్టమే అంటున్నారు. సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చి ఉంటే.. ఈ పాటికి సోషల్ మీడియాలో బాహుబలి యూనిట్ సభ్యులు ఓ రేంజిలో వాయించేసి ఉండేవాళ్లు. అదేం లేకుండా సైలెంటుగా ఉన్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జాకీ చాన్.. జెట్ లీ సినిమాలు కూడా ఇదే టైంలో రిలీజవ్వడం.. పైగా మరో సౌత్ ఇండియన్ మూవీ ‘కబాలి’ రావడంతో ‘బాహుబలి’ మీద చైనా జనాల ఫోకస్ నిలవలేదని అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు