తమన్నాను వదిలేలా లేడే!!

తమన్నాను వదిలేలా లేడే!!

ఒక్క పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు తప్పిస్తే, మన స్టార్‌ హీరోలందరూ దాదాపు 20లలో ఉన్నవారే. వీళ్ళందరి సరసనా రెచ్చిపోయి నటిస్తున్న మన మిల్కీ భామ తమన్నాకు ఇప్పుడు కింగ్‌ రూపంలో పెద్ద చిక్కేవచ్చిపడింది.

అవును, ఆ మధ్య తడాఖా ఆడియో ఫంక్షన్లో నాతో సినిమా ఎప్పుడు అని అడిగిన నాగార్జున, మొన్న తడాఖా సక్సెస్‌ గురించి మాట్లాడటానికి పెట్టిన ఇంటర్యూలో కూడా నాతో సినిమా చేస్తావా లేకపోతే మళ్ళీ చైతూతో చేస్తావా అని అడిగాడు. మన హాట్‌ బేబి చాలా తెలివిగా, చిన్నపిల్లను సార్‌ ఇబ్బందిపెట్టకండి అంటూ టాపిక్‌ను ప్రక్కనపెట్టేసింది. అసలు నాగ్‌ తమన్నాతో సినిమా చేయాలని నిజంగా అంత కుతూహలంగా ఉన్నాడని ఈ ఇంటర్యూ చూస్తే అర్ధమవుతోంది. కాని నాగ్‌ సరసన తమన్నా అస్సలు సూటవ్వదని చాలామంది విమర్శకులు అభిప్రాయం.  ఎంత యంగ్‌ లుక్స్‌ మెయిన్‌టెయిన్‌ చేసినా, నాగ్‌కు వయస్సు మీదపడినట్లు సినిమా స్క్రీన్‌లో చూస్తే పక్కాగా తెలుస్తోంది.

ఆయన ప్రక్కన నయనతార, ఆండ్రయా వంటి ముదురు మొహాలు సెట్టయినట్లు, తమన్నా సెట్టవ్వదని వీరి వాదన. అయినాసరే, నాగ్‌ మాత్రం తమన్నాను వదిలేలా లేడు. ఏదో ఒక రోజున సినిమా చేసేస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English