నిర్మాతలకి చుక్కలు చూపిస్తోన్న రవితేజ

నిర్మాతలకి చుక్కలు చూపిస్తోన్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ ఇదివరకు ఒక సినిమా అయిపోగానే మరోటి పట్టాలెక్కించేసేవాడు. యాభై ఏళ్లకి దగ్గర పడుతున్నాడు కనుక అంత స్పీడు పనికి రాదని అనుకుంటున్నాడో, లేక కొద్ది సినిమాలే చేసి కోట్లు వెనకేద్దామని అనుకుంటున్నాడో కానీ ఈమధ్య రవితేజ మరీ నల్లపూస అయిపోయాడు. బెంగాల్‌ టైగర్‌ రిలీజ్‌ అయి ఏడు నెలలు గడిచిపోయినా రవితేజ తదుపరి చిత్రం ఇంతవరకు మొదలు కాలేదు. నిర్మాతలని, దర్శకులని మార్చేస్తోన్న రవితేజకి ప్రాజెక్ట్‌ ఎందుకు సెట్‌ అవడం లేదనే దాని వెనక ఓ కారణం ఉందట.

రవితేజ ఇప్పుడు తనకి పది కోట్ల పారితోషికం కావాలని పట్టు పడుతున్నాడట. కానీ రవితేజ మార్కెట్‌ ఏమో ముప్పయ్‌ కోట్ల లోపే ఉంది. శాటిలైట్‌ హక్కులు కలిపినా కానీ ముప్పయ్‌ టచ్‌ అవడం గగనం అయిపోతోంది. కావాలంటే సినిమాని పది కోట్లలో చుట్టేయమని, తనకి మాత్రం పది కోట్లు ఇవ్వాలని రవితేజ అంటున్నాడట. అలా పది కోట్లలో చీప్‌గా చుట్టేయడానికి నిర్మాతలు ధైర్యం చేయరు కాబట్టి మాస్‌ మహారాజాకి డీల్స్‌ సెట్‌ అవడం లేదని భోగట్టా. సీనియర్‌ నిర్మాతలంతా అతడితో డిస్టెన్స్‌ పాటిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి ఇద్దరు కొత్త నిర్మాతలతో రవితేజ మంతనాలు సాగిస్తున్నాడు. రవితేజ కండిషన్లకి వారు తల ఊపి, అతను అడిగిన పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే ఈ సినిమాలు సెట్స్‌ మీదకి వెళతాయి. లేదంటే మళ్లీ మాస్‌ మహారాజు నిర్మాతల కోసం వేట మొదలు పెట్టాల్సిందే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు