పెళ్లిచూపులు.. సైలెంట్ కిల్ల‌ర్..

పెళ్లిచూపులు.. సైలెంట్ కిల్ల‌ర్..

కొన్నిసార్లు మ‌నం అస్స‌లు ఊహించ‌ని సినిమాలే బాక్సాఫీస్ ను దున్నేస్తుంటాయి. ఇప్పుడు అదే జ‌రుగుతుంది. అస‌లేమాత్రం అంచ‌నాల్లేకుండా విడుద‌లైన పెళ్లిచూపులు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతాలు చేస్తోంది. ఈ సినిమా తొలిరోజు నుంచే సూప‌ర్ క‌లెక్ష‌న్లు సాధిస్తుండ‌టం విశేషం. స్టార్ క్యాస్ట్ లేకుండా.. ప్ర‌మోష‌న్ లేకుండా.. హంగామా లేకుండా విడుద‌లైన పెళ్లిచూపులు సినిమాను ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ సినిమా కేవ‌లం 75 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వ్వ‌గా.. ఇప్పుడు ఆ సంఖ్య డ‌బుల్ అయిపోయింది. ఇంకా థియేట‌ర్స్ పెంచాలంటూ డిమాండ్ వ‌స్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే 1.70 కోట్లు వ‌సూలు చేసింది ఈ సినిమా.

ఓవ‌ర్సీస్ లో అయితే పెళ్లిచూపులు రికార్డులు మామూలుగా లేవు. అక్క‌డ మూడ్రోజుల‌కే 2 కోట్లు వ‌సూలు చేసింది పెళ్లిచూపులు. కంప్లీట్ యూత్ ఫుల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన పెళ్లిచూపులు.. ఫుల్ ర‌న్ లో 12 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తోంది. త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రితూవ‌ర్మ జంట‌గా న‌టించారు. ప్రియ‌ద‌ర్శి కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. వీక్ డేస్ లోనూ థియేట‌ర్స్ ఫుల్ అవుతున్నాయంటే పెళ్లిచూపులు హ‌వా ఏ స్థాయిలో చెప్పొచ్చు. మొత్తానికి క్ష‌ణం త‌ర్వాత మ‌రో చిన్న సినిమా బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు