సునీల్ ఆ మత్తులో ఎందుకున్నాడంటే...

సునీల్ ఆ మత్తులో ఎందుకున్నాడంటే...

అసలే సునీల్‌‌ను హీరోగా చూడటానికి మెజారిటీ ఆడియన్స్ ఇష్టపడట్లేదు. పైగా అతనేమో రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తున్నాడు. అతడి సినిమాలు వరుసగా ఒకదాన్ని ఇంకోటి డిజాస్టర్లు అవుతున్నా.. సునీల్ విషయంలో ఫీడ్ బ్యాక్ చాలా వరకు నెగెటివ్‌గా వస్తున్నా అతడిలో మార్పు రావట్లేదు. ‘కృష్ణాష్టమి’ విషయంలోనే సునీల్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా అతను మారలేదు. ‘జక్కన్న’లోనూ మళ్లీ అదే తీరుగా కనిపించాడు. రెగ్యులర్ మాస్ హీరోలే కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటే.. సునీల్ లాంటి కమెడియన్ టర్న్డ్ హీరో మాస్ వేషాల మీద అంత మోజు చూపించడం.. పాత చింతకాయ పచ్చడి కథలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సునీల్ మరీ ఇంతగా మత్తులో కూరుకుపోయాడేంటి.. అతడిలో ఎందుకు మార్పు రావట్లేదు అని చర్చించుకుంటున్నారు జనాలు.

ఐతే ‘కృష్ణాష్టమి’.. ‘జక్కన్న’ సినిమాలకు ఎంత నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ వాటికి ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. ముఖ్యంగా బి-సి సెంటర్లలో సునీల్ సినిమాల పట్ల జనాలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘కృష్ణాష్టమి’ తర్వాత ‘జక్కన్న’ మీద జనాలు ఆసక్తి చూపించరేమో అనుకున్నారంతా. కానీ ఈ సినిమాకు తొలి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ముఖ్యంగా మాస్ సెంటర్లలో థియేటర్లు కళకళలాడాయి. తొలి రోజు.. తొలి వీకెండ్లో ‘జక్కన్న’ అంచనాలకు మించే వసూళ్లు సాధించింది. ఓ ఓపెనింగ్స్.. మాస్ లో ఈ ఫాలోయింగ్ చూసే సునీల్ మళ్లీ మళ్లీ మసాలా కథలు ట్రై చేస్తున్నాడు. పెద్ద హీరోలు క్లాస్ కథలు.. క్యారెక్టర్ల వైపు వెళ్లిపోతున్న నేపథ్యంలో మంచి మసాలా సినిమాల్ని మిస్సయిపోతున్నారు మాస్ జనం. ఆ మధ్య ‘సరైనోడు’కు ఎంత డివైడ్ టాక్ వచ్చినా.. భారీగా వసూళ్లు రావడానికి అదే కారణం. ఐతే ఎంత మాస్ సినిమా అయినా.. ఆ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చాలి. మిగతా ఆడియన్స్ నుంచి కూడా ఆమోదం పొందాలి. సునీల్ సినిమాలకు అదే ఉండట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు