మురుగదాస్ కి.. మహేశ్ కి ‘నో’ చెప్పేయటమా?

మురుగదాస్ కి.. మహేశ్ కి ‘నో’ చెప్పేయటమా?

కొంతమంది దర్శకులతో పని చేయటాన్ని అదృష్టంగా భావిస్తుంటారు హీరోలు.. హీరోయిన్లు. అలాంటి చాన్స్ దక్కితే.. ఏదోరకంగా సర్దుబాటు చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. అలాంటి విన్నంతనే మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉన్న ఒక బంపర్ ఆఫర్ ను అతిలోకసుందరి కుమార్తె నో చెప్పటం పెద్ద చర్చగా మారింది. ట్రెండ్ సెట్టర్ దర్శకుడు మురుగుదాస్ చేస్తున్న మహేశ్ బాబు సినిమాలో  శ్రీదేవి కుమార్తె జాన్వీకి తొలుత ఆఫర్ ఇచ్చారట.

ఓపక్క టాప్ డైరెక్టర్.. మరోవైపు మహేశ్ సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు. కానీ.. జాన్వీ మాత్రం ఈ ఆఫర్ ను లైట్ తీసుకుందట. అమెరికాలోని యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ చిన్నది.. తాను ఇంకా సినిమాల్లో నటించటానికి సరిపడా సిద్ధం కాలేదని చెప్పి తప్పించుకుందట. హిందీలో గ్రాండ్ లాంఛ్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. మురుగుదాస్ ఆఫర్ ను వదులుకోవటం జాన్వీ అమాయకత్వంగా పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏమైనా అతిలోక సుందరి కుమార్తె అద్భుతమైన ఆఫర్ ను మిస్ చేసుకుందనటంలో సందేహం లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English