మహేష్ సినిమా.. కథ కూడా వినకుండానే

మహేష్ సినిమా.. కథ కూడా వినకుండానే

మహేష్ బాబు కొత్త సినిమాలో హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. ఓ దశలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పేరు దాదాపుగా ఖరారైపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టులోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చేసింది. ఐతే ఈ సినిమాలో తనకు అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలేదని.. అందర్లాగే తాను కూడా ఈ సినిమాలో పరిణీతినే హీరోయిన్ అని మీడియాలో చదివానని.. అలాంటిది చివరికి తనకు అవకాశం దక్కడం నమ్మశక్యంగా లేదని రకుల్ ప్రీత్ చెప్పింది. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అనగానే కథ ఏంటో తెలుసుకోకుండానే ఒప్పేసుకున్నానని రకుల్ చెపప్పింది.

‘‘మహేష్-మురుగదాస్ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తారనే చాలా చర్చ జరిగిందన్న సంగతి నాకు తెలుసు. పరిణీతి చోప్రాని తీసుకున్నారనే వార్త కూడా వచ్చింది. దాంతో ఈ సినిమాలో నాకు అవకాశం దక్కదనే అనుకున్నా. కానీ ఆ తర్వాత నా పేరు పరిశీలిస్తున్నారని తెలిసింది. అది విని చాలా ఎగ్జైటయ్యాను. ఈ సినిమాకు నన్ను అడిగినప్పుడు నేను కాశ్మీర్‌లో ఉన్నాను. హీరోయిన్‌గా నన్నే ఎంపిక చేసినట్లు చెబుతూ కాల్ చేసినపుడు ఆనందం పట్టలేకపోయాను. ఫోన్ మాట్లాడ్డం అవ్వగానే ఎగిరి గంతేసా. కథ కూడా వినకుండా ఆ సినిమా ఒప్పేసుకున్నాను. మురుగదాస్ మామూలు కథలు రాయరు. ఆయన సినిమాలు అన్ని వయసులవాళ్లూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. ఇక మహేష్ సూపర్ స్టార్.  ఇలాంటి వాళ్లతో సినిమా చేయడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అని రకుల్ చెప్పింది. త్వరలోనే తాను మహేష్ సినిమా షూటింగులో పాల్గొంటానని రకుల్ తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు