తారకరత్నతో తారకరత్నకే పోటీ

తారకరత్నతో తారకరత్నకే పోటీ

హీరోగా నిలదొక్కుకోవడానికి పుష్కరం నుంచి పోరాడుతున్నాడు నందమూరి తారకరత్న. కానీ ఇప్పటిదాకా హీరోగా ఒక్కటంటే ఒక్క హిట్టూ అందుకోలేదు. గత కొన్నేళ్లలో తారకరత్న సినిమా వస్తోందంటే జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. ఐతే హీరోగా కెరీర్ ఊపందుకోకున్నా.. విలన్ అవతారమెత్తి ‘అమరావతి’, ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి సినిమాలతో కొంతవరకు గుర్తింపు సంపాదించాడు తారకరత్న. లేటెస్టుగా ‘మనమంతా’ సినిమాలోనూ అతను ఓ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కాబోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తారకరత్న హీరోగా నటించిన ఓ సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే.. కాకతీయుడు.

సింహరాశి, శివరామరాజు లాంటి సినిమాలు తీసిన వి.సముద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘కాకతీయుడు’ ఎప్పుడో రెండేళ్ల కిందటే సినిమా పూర్తయింది. కానీ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడేదో క్లియరెన్స్ సేల్ అన్నట్లు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఈ సినిమాను జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. ఆగస్టు 5న ‘మనమంతా’తో పాటు ‘శ్రీరస్తు శుభమస్తు’ కూడా మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్నాయి. మరోవైపు ‘కాకతీయుడు’ మాదిరే విడుదలకు నోచుకోకుండా ఉన్న తారకరత్న సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయి. నేను చాలా వరస్ట్ అని.. విజేత అని.. ఇంకా ఐదారు సినిమాలు పూర్తి చేశాడు తారకరత్న. మరి వాటి సంగతి ఎప్పుడు తేలుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు