ఈసారి తమన్నా విశ్వరూపంతో..

ఈసారి తమన్నా విశ్వరూపంతో..

'అభినేత్రి' అనే లేడీ ఓరియెంటెడ్‌ టైటిల్‌ పెట్టారు కానీ.. ఈ సినిమా ఫస్ట్‌ టీజర్‌ రిలీజ్‌ చేసినపుడు అసలందులో హీరోయినే కనిపించలేదు. ప్రభుదేవా తనదైన స్టయిల్లో డ్యాన్సులు చేస్తూ టీజర్‌ అంతా నిండిపోయాడు. తమన్నా అస్సలు కనిపించలేదు. ఇది తమ్మూ అభిమానుల్ని నిరాశ పరిచింది. ఐతే ఇప్పుడు తమన్నా విశ్వరూపం చూపించడానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 2న 'అభినేత్రి' రెండో టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్న కోన వెంకట్‌ వెల్లడించాడు. ఈ టీజర్లో తమన్నా చెలరేగిపోయిందని కోన చెప్పాడు. ఐతే ఈ టీజర్‌ గురించి చెబుతూ రిలీజ్‌ చేసిన పోస్టర్లోనూ మళ్లీ ప్రభుదేవానే చూపించారు. ఐతే పోస్టర్‌ మాత్రం భలేగా ఉంది.

దర్శకుడిగా మారాక బాలీవుడ్‌ వెళ్లిపోయిన ప్రభుదేవా.. అక్కడే 'ఏబీసీడీ' సినిమాలో కనిపించాడు. సౌత్‌లో దశాబ్దం పైగా విరామం తర్వాత 'అభినేత్రి'లో నటిస్తున్నాడు. ఇంత గ్యాప్‌ వచ్చినా.. వయసు పెరిగినా ప్రభుదేవా డ్యాన్సింగ్‌ గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని ఆ మధ్యన రిలీజైన టీజర్‌తో అర్థమైంది. ఈ సినిమాలో తమన్నా కూడా ఓ రేంజిలో డ్యాన్సులేసిందని రిహార్సల్స్‌ వీడియోల్లోనే అర్థమైంది. టీజర్లో సైతం తమన్నా డ్యాన్స్‌ టాలెంట్‌ చూపిస్తారని సమాచారం. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో తెరకెక్కుతన్న ఈ సినిమాకు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఇదో రొమాంటిక్‌ హార్రర్‌ కామెడీ. తమన్నా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ పాత్రలో సంప్రదాయ పల్లెటూరి అమ్మాయిగా.. ఇంకో పాత్రలో చాలా మోడర్నగా కనిపించబోతోంది తమన్నా. సెప్టెంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English