దిల్ రాజు ప్రత్యర్థి భారీ ప్రణాళికలే..

దిల్ రాజు ప్రత్యర్థి భారీ ప్రణాళికలే..

నైజాం ఏరియాలో దిల్ రాజు ఏకఛత్రాధిపత్యానికి తెరదించిన డిస్ట్రిబ్యూటర్ అభిషేక్. రిలయన్స్ బ్యాకప్ తో డిస్ట్రిబ్యూషన్లోకి అడుగుపెట్టిన అభిషేక్.. దిల్ రాజుకు పోటీగా వెళ్లి కొన్ని భారీ చిత్రాల్ని దక్కించుకున్నాడు. వాటిలో కొన్ని మంచి ఫలితాల్నిచ్చాయి కూడా. డిస్ట్రిబ్యూషన్లో అనుభవం సంపాదించాక దిల్ రాజు తరహాలోనే ఇప్పుడు నిర్మాణం మీద ఫోకస్ పెడుతున్నాడు అభిషేక్.

నిర్మాతగా ఒకేసారి ఐదు సినిమాల్ని అభిషేక్ పిక్చర్స్ పట్టాలెక్కించబోతుండటం విశేషం. ఆ ఐదు ప్రాజెక్టుల విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు అభిషేక్. బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోయే సినిమానే అభిషేక్ పిక్చర్స్ బేనర్లో రాబోయే తొలి సినిమా అన్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తాడని.. సెప్టెంబర్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అభిషేక్ వెల్లడించాడు.

మరోవైపు స్వామిరారా కాంబినేషన్లో అభిషేక్ ఒక సినిమా తీస్తారట. సుధీర్ వర్మ దర్శకుడు. నిఖిల్ హీరో. ఇది కూడా సెప్టెంబర్లోనే మొదలవుతుంది. మరోవైపు అడివిశేష్-ఆదా శర్మ కాంబినేషన్లో రాహుల్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా మొదలుపెడతారట. సుధీర్ బాబు హీరోగా గోపీచంద్ బయోపిక్ ను తెలుగు-హిందీ భాషల్లో ఒకేసారి మొదలుపెట్టబోతున్నట్లు కూడా అభిషేక్ వెల్లడించాడు. అవసరాల శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ అడల్ట్ కామెడీ ‘హంటర్’ రీమేక్ ను కూడా తానే నిర్మించనున్నట్లు అభిషేక్ తెలిపాడు. మొత్తానికి నిర్మాతగా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లున్నాడు అభిషేక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు