అమలాపాల్ పేరే ఎత్తొద్దంటున్న విజయ్

అమలాపాల్ పేరే ఎత్తొద్దంటున్న విజయ్

మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ జంట ఎ.ఎల్.విజయ్-అమలా పాల్ విడిపోవడం ఖాయమని తేలిపోయింది. స్వయంగా విజయ్ తండ్రి ఎ.ఎల్.అళగప్పనే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. విజయ్, అమల విడిపోయారని ఆయన మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా అమలాపాల్ ప్రస్తావన అనవసరమని విజయ్ అనడంతో అమలాకు అతను దూరమైన సంగతి పక్కా అని స్పష్టమైంది.

ఇక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకుంటానని విజయ్ అన్నాడు. ఈ మాటల్ని బట్టి విజయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అమలను పెళ్లి చేసుకున్నాడేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. విజయ్‌కు ఇష్టం లేకున్నా అమలా సినిమాల్లో నటించడానికి సిద్ధపడటం వీళ్లిద్దరూ విడిపోవడానికి ఓ కారణమని ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు అమలా ఓ ఢిల్లీ డిజైనర్‌తో సన్నిహితంగా మెలుగుతుండటం మరో కారణమని అంటున్నారు.

ఓ బి-గ్రేడ్ సినిమాతో తమిళ తెరకు పరిచయమైన అమల.. ఆ తర్వాత తెలుగులోకి ‘ప్రేమఖైదీ’ పేరుతో అనువాదమైన సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. విజయ్ తీసిన ‘నాన్న’ సినిమాలో నటించినపుడు ఆమె అతడికి చేరువైంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘తలైవా’ సినిమా కూడా వచ్చింది. అప్పుడే వాళ్లిద్దరి బంధం బలపడింది. 2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు