ఇది మరీ టూమచ్ తమన్..

ఇది మరీ టూమచ్ తమన్..

తమిళ సినిమా ఫీల్డును ఫాలో అయ్యేవాళ్లకు ధనుష్-శింబుల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి మధ్య ప్రొఫెషనల్ పోటీతో పాటు వ్యక్తిగతంగానూ కొంత వరకు వైరం ఉంది. అది బయటికి బయటికి కనిపించదు కానీ.. అంతర్లీనంగా వార్ నడుస్తూ ఉంటుంది. వీళ్లిద్దరి అభిమానుల మధ్య గొడవలు జరగడం మామూలే. అలాంటివాళ్లను పట్టుకొచ్చి తన సినిమాలో పాటలు పాడించి ఆశ్చర్యపరిచాడు తమన్.

‘తిక్క’ సినిమాలో ధనుష్ పాట పాడుతున్నాడన్న సంగతి మూడు రోజులుగా హాట్ టాపిక్ అవుతుండగా.. ఇంతలో శింబు సైతం ఈ సినిమాలో ఇంకో పాట వేసుకున్నాడని రివీల్ చేసి షాకిచ్చాడు తమన్. ధనుష్, ఇప్పటిదాకా తమిళంలోనే కలిసి పాడింది లేదు. అలాంటిది ఓ తెలుగు సినిమాలో ఒక్కొక్కరు ఒక్కో పాట పాడటం చిత్రమే. శింబు ఇప్పటికే పోటుగాడు, బాద్‌షా సినిమాల్లో పాటలు పాడాడు.

ఐతే తమన్ చేసింది మరీ టూమచ్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలే తమన్ తెలుగు సింగర్లకు అవకాశాలివ్వడన్న విమర్శలున్నాయి. ఇప్పుడు మరీ ఇద్దరు తమిళ హీరోలతో ఒకే సినిమాలో పాటలు పాడించడం టూమచ్ కాక మరేంటి? ఇద్దరు హీరోలతో పాడించాలనుకుంటే.. ధనుష్‌తో పాడించి.. ఇంకో తెలుగు హీరో ఎవరినైనా ట్రై చేయాల్సింది. అయినా తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఎవరు పాడినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. సింగర్ గొంతు ఎలా ఉన్నా.. ట్రాక్‌ను ట్విస్ట్ చేసి రాగయుక్తంగా మార్చేయడం తమన్‌కు తెలిసిన విద్యే కదా. అలాంటపుడు ఎవరు పాడితే ఏముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు