పవిత్ర కూడా ప్లాటినమ్‌ కామెడి

పవిత్ర కూడా ప్లాటినమ్‌ కామెడి

మే 10న ఎట్టిపరిస్థితుల్లో ఆంధ్ర ప్రేక్షకులు మతిపోగొట్టేద్దాం అనుకున్న 'పవిత్ర', చివరకు పవిత్రంగా ల్యాబ్‌లోనే ఉండిపోయింది. సినిమా రిలీజ్‌ డేటును త్వరలోనే ఖరారు చేస్తామంటున్నారు నిర్మాతలు. అయితే జనాల్లో సినిమా మీద ఉండే హైప్‌, క్రేజ్‌ పడిపోకుండా ఉండాలని ఈ నెల 19న ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేశారు.

సినిమాకు సంబంధించిన ఆడియో సిడిలు ఒక పదివేలో, లక్షో అమ్ముడుపోతే ఇలాంటి ఫంక్షన్లు చేస్తారు.. ఇద్దరమ్మాయిలతో వంటి టాప్‌ గ్రేడ్‌ మ్యూజిక్‌ ఉన్న సినిమాలకు కూడా కనీసం ఒక 2000లకు మించి ఆడియో సిడిలు/కాసెట్లు అమ్ముడుపోవడం లేదు. ఏదో కార్లో వినేవాళ్ళు  కొనుక్కుంటున్నారే కాని, మిగిలిన వారందరూ నెట్‌లోంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బులు కట్టి డౌన్‌లోడ్‌ చేస్తారు, కొంతమంది పైరసీ పైన డిపెండ్‌ అవుతున్నారు.

ఈ తరుణంలో పవిత్ర లాంటి సినిమాలకు ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ అంటే జనాలకు ఇంకా కామెడీగా ఉంది. కాని ఏం చేస్తాం, సినిమాకు పబ్లిసిటీ కావాలి కాబట్టి, కామెడీ అయినాకూడా కొన్ని ఫంక్షన్లు పెట్టాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English