శ్రీదేవిని అలా వాడుకున్నారా...

శ్రీదేవిని అలా వాడుకున్నారా...

దక్షిణాది హీరోయిన్లు బాగా సంపాదించుకోవాలంటే దానికి ఏకైక అస్త్రం టాలీవుడ్‌. అవును నిజమే. తమిళంలో 40 లక్షలకే సినిమా చేసే త్రిష, మళయాలంలో 10 లక్షలకు చేసే మీరాజాస్మిన్‌, కన్నడలో 5 లక్షలకు చేస్తున్న  ప్రణీత తెలుగులో మాత్రం భయకరంగా డిమాండ్‌ చేస్తారు. త్రిషకు కోటి కావాలి, మీరాజాస్మిన్‌కు 50 లక్షలు కావాలి, ప్రణీత మొన్ననే ఒక కొత్త ప్రొడ్యూసర్‌కు కోటిన్నర కావాలని షాకిచ్చింది. 

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మాజీ హీరోయిన్‌ శ్రీదేవి చేసిన కామెంట్‌ అలా ఉంది. తమిళంలో టాలెంట్‌ ఉన్న పాత్రలొస్తాయికాని, తెలుగులో మాత్రం అందరూ గ్లామరే కావాలని అడుగుతారు అనేసింది. తెలుగులో అందరూ ఆమెను గ్లామర్‌కోసమే వాడుకున్నారట. మరి హీరోయిన్‌లు ఆ రేంజ్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తే లేదుకాని, ఇక్కడ ప్రొడ్యూసర్లు గ్లామర్‌ను అడిగితే తప్పొచ్చిందా అంటూ విమర్శకులు విరుచుకుపడుతూ పైన పేర్కొన ఉదాహరణలు చెప్పారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు