ప‌ర‌శురామ్ క‌థ‌.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం

ప‌ర‌శురామ్ క‌థ‌.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం

‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు లీడింగ్ డైరెక్ట‌ర్ క్రిష్‌. త‌న‌కు ప‌ర‌శురామ్ సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని.. కుదిరితే అత‌డి క‌థ‌తో తాను సినిమా తీయాల‌ని కోరుకుంటున్నాన‌ని క్రిష్ చెప్పాడు.

‘‘నేను కొన్ని సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డతా. కొన్ని సినిమాల‌ను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలా చూడ‌టానికి ఇష్ట‌ప‌డే సినిమాల్లో ప‌ర‌శురామ్ తీసేవి ఉంటాయి.. ప‌రుశురామ్  గ్రేట్ డైరెక్ట‌ర్. అత‌ను క‌థ రాస్తే నేను డైరెక్ట్ చేయాల‌ని ఉంది.  ప‌ర‌శురామ్  యువ‌త సినిమా తీసే టైంలో ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అత‌డితో ఆత్మీయ అనుబంధం ఏర్ప‌డింది. నాకు వేదం సినిమా విష‌యంలో బ‌న్నీ ప్రోత్సాహం అందించాడు. అలాగే ప‌ర‌శురామ్ కు కూడా ప్రోత్సాహం కావాలి. అత‌డిలో కావాల్సినంత ప్రేమ ఉంది.  ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ క‌థ విన్నాను. చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే క‌థ అది’’ అని క్రిష్ చెప్పాడు.

శిరీష్ గురించి మాట్లాడుతూ.. అత‌ను ప్రేమ వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డంలో దిట్ట అని క్రిష్ చెప్ప‌డం విశేషం. అల్లు అర‌వింద్ కు తెలుసో లేదో కానీ.. శిరీష్ కు సంబంధించి త‌న‌కు రెండు ల‌వ్ స్టోరీల గురించి తెలుస‌ని క్రిష్ అన్నాడు. వ‌య‌సులో చిన్నోడైనా ప్రేమాయ‌ణాలు న‌డ‌ప‌డంలో శిరీష్ పెద్ద‌న్న అని క్రిష్ వ్యాఖ్యానించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English