శిరీష్‌ ప్రేమకథల గుట్టువిప్పిన క్రిష్‌

శిరీష్‌ ప్రేమకథల గుట్టువిప్పిన క్రిష్‌

అల్లు అరవింద్‌ చిన్న కొడుకు అల్లు శిరీష్‌ మహా ఘటికుడు అంటున్నాడు దర్శకుడు క్రిష్‌. శిరీష్‌ కనిపించేంత అమాయకుడు కాదని.. అతడి ప్రేమ వ్యవహారాల గురించి తనకు తెలుసని క్రిష్‌ అన్నాడు. శిరీష్‌ కొత్త సినిమా 'శ్రీరస్తు శుభమస్తు' ట్రైలర్‌ రిలీజ్‌ సందఠంగా క్రిష్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ''అల్లు అరవింద్‌ గారికి తెలుసో లేదో కానీ శిరీష్‌ కు రెండు లవ్‌ స్టోరీలు ఉన్నాయి. శిరీష్‌ వయసులో చిన్నోడే అయినా ప్రేమ వ్యవహారాల్లో మాత్రం మా అందరికీ పెద్దన్న'' అని వేదిక మీదే అల్లు అరవింద్‌ సమక్షంలో అన్నాడు క్రిష్‌. దీంతో అల్లు అరవింద్‌ సహా అందరి ముఖాలూ నవ్వులు పులుముకున్నాయి. ఇంతకీ శిరీష్‌ ఎవరితో ప్రేమాయణాలు నడిపాడో చెప్పలేదు క్రిష్‌.

ఇక 'శ్రీరస్తు శుభమ'స్తు సినిమా గురించి.. దర్శకుడు పరశురామ్‌ గురించి క్రిష్‌ చెబుతూ.. ''నేను కొన్ని సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. కొన్ని సినిమాలను చూడడానికి ఇష్టపడతాను. అలా ఇష్టపడేవాటిలో పరుశురామ్‌ సినిమాలుంటాయి. యువత సినిమా తీసే సమయంలో పరుశురామ్‌ ను కలిశాను. అప్పట్న్రుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. 'శ్రీరస్తు శుభమస్తు' కథ విన్నాను చాలా ఎగ్జైటింగ్‌ గా అనిపించింది. పరుశురామ్‌ లో కావాల్సినంత ప్రేమ ఉంది. అతడికి ప్రొత్సాహం కావాలి. పరుశురామ్‌  గ్రేట్‌ డైరెక్టర్‌. అతను కథ రాస్తే నేను డైరెక్ట్‌ చేయాలని ఉంది'' అని క్రిష్‌ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు