డబ్బు తో మారుతిని కొట్టాడా?

డబ్బు తో మారుతిని కొట్టాడా?

మొన్న 'బాబు బంగారం' ఆడియో వేడుకలో తనకు తాను 'స్టార్‌ డైరెక్టర్‌' అని కితాబిచ్చేసుకున్నాడు దాసరి మారుతి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దాయన దాసరి నారాయణరావు సైతం మారుతి 'బాబు బంగారం'తో స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడని కితాబిచ్చేశాడు. తొలిసారి వెంకీ లాంటి స్టార్‌ హీరోతో పని చేసిన మారుతి.. ఈ సినిమాతో హిట్టిచ్చాడంటే తన స్థాయిని పెంచుకుంటాడనడంలో సందేహం లేదు. వెంకీ కంటే పెద్ద రేంజున్న హీరోలు అతడి వైపు చూసే అవకాశముంది. ఐతే మారుతి మాత్రం కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చినట్లే అసలే ఇమేజ్‌ లేని యువ కథానాయకుడు హవీష్‌తోనే సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

'నువ్విలా' సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించి.. ఆ తర్వాత జీనియస్‌, రామ్‌ లీలా లాంటి సినిమాల్లో సోలో హీరోగా కనిపించిన హవీష్‌.. ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐతే డబ్బులకు లోటు లేదు కాబట్టి ఈసారి కాస్త పేరున్న దర్శకుడితోనే సినిమా చేయాలని ఫిక్సయి హవీష్‌.. మారుతిని లైన్లో పెట్టాడు. చిన్న సినిమాలతోనే ప్రస్థానం మొదలుపెట్టిన మారుతి.. ఇప్పుడు తన స్థాయి ఏంటో.. ఈ సినిమా చేయడం వల్ల తన ఇమేజ్‌కు ఏమైనా నష్టమో కాదో కూడా చూసుకోకుండా ఈ సినిమాకు ఓకే చెప్పేశాడట. మాంచి పారితోషకం ఆఫర్‌ చేస్తుండటంతో మారుతి టెంప్ట్‌ అయిపోయినట్లుంది. ఈ సినిమాను మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేసి ఆలోపే స్టార్‌ హీరోను లైన్లో పెట్టేయొచ్చని భావిస్తున్నాడట మారుతి. మరి ఈ నిర్ణయం అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు