తెలుగు ఇండస్ట్రీపై పగ బట్టిన నయన..

తెలుగు ఇండస్ట్రీపై పగ బట్టిన నయన..


నయనతార.. పేరుకు తగ్గట్లే ఇప్పుడు ఈ భామ డిమాండ్‌ తారల్లోనే ఉంది. స్టార్‌ హీరోలు కూడా నయన కోసం వేచి చూడటం తప్ప మరేం చేయలేకపోతున్నారు. కొన్ని పాత్రలకు నయనతార తప్ప మరో ఆప్షన్‌ లేదు అన్నట్లు తయారైంది ఈ భామ. అందుకే క్రేజ్‌ కూడా అలాగే ఉంది. ఇక రెమ్యునరేషన్‌ అయితే చెప్పనక్కర్లేదు. అడిగినంత ఇచ్చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది ఈ భామ. అయితే ఈ మధ్య నయనపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. తెలుగులో ఈ భామ వెంకటేశ్‌ కు జోడీగా బాబు బంగారంలో నటిస్తోంది. ఇందులో నటించడానికి నయనతారకు రెండు కోట్లు సమర్పించుకున్నారని వినికిడి.

ఇదంతా బాగానే ఉంది కానీ.. తాజాగా నయనతార వల్లే సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు ఆ మధ్య బాగా వినిపించాయి. కేవలం ఈ భామ సహకరించకపోవడం వల్లే ఓ పాట లేకుండానే షూటింగ్‌ కు ప్యాకప్‌ చెప్పాల్సి వచ్చిందంటున్నారు చిత్రయూనిట్‌. లవ్‌ లో ఫెయిలవ్వడం.. ఇదే టైమ్‌ లో తమిళనాట ఎక్కువ సినిమాలు చేతిలో ఉండటంతో తెలుగు సినిమాలను తక్కువగా చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ప్రమోషన్‌ కు రానని ముందే తెగేసి చెబుతోంది నయనతార. ఈ మధ్యే జరిగిన బాబు బంగారం ఆడియో వేడుకకు కూడా రాలేదు నయన. 

ఇప్పుడే కాదు.. కెరీర్‌ మొదట్నుంచీ తెలుగు ఇండస్ట్రీ అంటే నయనకు చిన్నచూపు ఉంది. ప్రమోషన్‌ కు ముందు నుంచీ రానంటే రానని తెగేసి చెబుతోంది ఈ భామ. సినిమాకు సైన్‌ చేసే ముందే ప్రమోషన్‌ కు రాకూడదనే రూల్‌ పెట్టుకుంటుంది. బాబు బంగారం విషయంలోనూ ఇది అప్లై అవుతోంది. తమిళ సినిమాలకు మాత్రం ఎగేసుకుంటూ ప్రమోషన్‌ కు వెళ్లే నయన.. తెలుగు సినిమాలను మాత్రం చీప్‌ గా చూస్తోంది. చిరంజీవి, బాలయ్య సినిమాలకు డేట్స్‌ అడిగితే కూడా లేవని చెప్పేసింది ఈ బ్యూటీ. మరి ఏం చూసుకుని నయన ఇంత పొగరు చూపిస్తుందో..? అని కోపగించుకుంటోంది తెలుగు చిత్ర పరిశ్రమ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English