దృశ్యం లాంటి సినిమాలు వద్దంటున్న నాని

దృశ్యం లాంటి సినిమాలు వద్దంటున్న నాని

దృశ్యం.. విక్టరీ వెంకటేష్ కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా. గత కొన్నేళ్లో వెంకీ సోలో హీరోగా కొట్టిన ఏకైక హిట్టు. ఐతే నాని మాత్రం వెంకీని అలాంటి సినిమాల్లో చూడాలని కోరుకోవట్లేదట. ఓ అభిమానిగా వెంకీని తాను ‘బాబు బంగారం’ తరహా సినిమాల్లోనే చూడాలనుకుంటానని నాని చెప్పాడు. ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన నాని ఆసక్తికర ప్రసంగంతో అలరించాడు. ఇంతకీ అతనేమన్నాడంటే..

‘‘మామూలుగా తాము ఎప్పుడూ కలవకుండా అభిమానించే వ్యక్తిని ఒకసారి కలిసినపుడు వాళ్ల మీద మనకున్న ఇమేజ్ తగ్గిపోతుంటుంది. మనం అనుకున్నంత స్థాయిలో లేరేంటి అనిపిస్తుంది. ఇక సినిమా వాళ్ల విషయంలో అయితే వాళ్లు చేసేవన్నీ లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు కాబట్టి ఈ ఫీలింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ నేను అభిమానించే ఓ వ్యక్తిని నేను నేరుగా కలిశాక ఆ అభిమానం ఇంకా పెరిగింది. ఆయనే వెంకటేష్ గారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం సినిమాలు బాగుంటాయి. కానీ వాటి కంటే కూడా క్షణ క్షణం, బొబ్బిలి రాజా, నువ్వు నాకు నచ్చావ్, బాబు బంగారం లాంటి సినిమాల్లోనే వెంకీని చూడాలని నేను కోరుకుంటా. అభిమానుల తరఫున కూడా ఆయనకు ఇదే మాట చెబుతున్నా. నాకు బాబు బంగారం లైన్ ఏంటో తెలుసు. కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. ఈసారి కొడుతున్నాం.. గట్టిగా కొడుతున్నాం. ప్రతి 15 ఏళ్లకోసారి కమర్షియల్ సినిమా అర్థం మారిపోతూ ఉంటుంది. ఇక నుంచి కమర్షియల్ సినిమా అంటే మారుతి సినిమాలా ఉండాలని అందరూ అనాలని కోరుకుంటున్నా’’ అని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు